Vijay Deverakonda And Boyapati Srinu: ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా సినిమా ట్రెండ్ లో, మేకర్స్ భారీ బడ్జెట్ కి స్కోప్ ఉన్న కథల వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ఇప్పుడు డైరెక్టర్స్ ని తమ వద్దకు పాన్ ఇండియా రేంజ్ స్కోప్ ఉన్న సబ్జక్ట్స్ తోనే రమ్మని అంటున్నారు. ఇలాంటి సమయం లో మాస్ ఆడియన్స్ కి సరైన మాస్ సినిమాలు తీసే డైరెక్టర్ గా కేవలం బోయపాటి శ్రీను(Boyapati srinu) మాత్రమే మిగిలి ఉన్నాడు. ఇప్పటి వరకు ఈయన తెరకెక్కించిన సినిమాల్లో అత్యధిక శాతం బాలకృష్ణ తో తీసినవే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కుర్ర హీరోలతో తీసిన సినిమాలు ఎందుకో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు దమ్ము, వినయ విధేయ రామ వంటి చిత్రాలు చేసి చేతులు కాల్చుకున్నారు.
Also Read: ‘అఖండ 2’ ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి..? ఊహించనిది ఇది!
ఇక బోయపాటి శ్రీను కి కూడా ఈయన బాలయ్య తో తప్ప, ఏ హీరో తో సూపర్ హిట్ సినిమా చెయ్యలేడు అనే ముద్ర బలంగా పడిపోయింది. ఎల్లుండి వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ 2’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని చూడబోతుంది అనేది కాసేపు పక్కన పెడితే, బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని కూడా యంగ్ హీరో తో చేయబోతున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. ఆ యంగ్ హీరో మరెవరో కాదు, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వద్ద బోయపాటి శ్రీను డేట్స్ చాలా కాలం నుండి ఉన్నాయి. వాస్తవానికి ఆ డేట్స్ తో హీరో సూర్య తో సినిమా చెయ్యాలి అనేది ప్లాన్ . కానీ ఎందుకో ఈ కాంబినేషన్ కుదర్లేదు. ఇప్పుడు అవే డేట్స్ ని విజయ్ దేవరకొండ కి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రీసెంట్ గానే అల్లు అరవింద్ కి వచ్చింది.
ఆయన వెంటనే విజయ్ దేవరకొండ కి ఫోన్ చేసి ఈ విషయాన్నీ చెప్పడం, ఆ తర్వాత బోయపాటి శ్రీను విజయ్ వద్దకు వెళ్లి కథని వినిపించడం, విజయ్ దేవరకొండ ఆ కథని అమితంగా ఇష్టపడడం జరిగింది. దీంతో త్వరలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమాని ఆశించవచ్చు అన్నమాట. కుర్ర హీరోలతో సినిమా చేసి బోయపాటి శ్రీను అందుకున్న ఏకైక హిట్ ‘సరైనోడు’. తన మేకింగ్ స్టైల్ ని అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా మార్చి చేసిన ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ ని కూడా సరైనోడు తరహా కథలో చూపించబోతున్నాడని, కచ్చితంగా ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.