Homeఎంటర్టైన్మెంట్Venkatesh Tweet On Chiranjeevi: అభిమానిగా చిరంజీవి తో కలిసి నటించడం నా అదృష్టం అంటూ...

Venkatesh Tweet On Chiranjeevi: అభిమానిగా చిరంజీవి తో కలిసి నటించడం నా అదృష్టం అంటూ వెంకటేష్ ఎమోషనల్ ట్వీట్!

Venkatesh Tweet On Chiranjeevi: నిన్నటి తరం హీరోలలో చిరంజీవి(Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఎలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అనేది మన కళ్లారా చూసాము. చిన్నతనం నుండి వీళ్లిద్దరి సినిమాలు విడుదలైతే థియేటర్స్ క్యూలలో గంటల తరబడి నిల్చొని సినిమాలు చూసిన రోజులే గుర్తుకొస్తాయి వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా. అంతే కాదు టాప్ 4 హీరోలలో అత్యధిక రికార్డులు నెలకొల్పిన హీరోలు కూడా వీళ్లిద్దరు మాత్రమే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ హీరోలకు ఉన్న […]

Venkatesh Tweet On Chiranjeevi: నిన్నటి తరం హీరోలలో చిరంజీవి(Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఎలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అనేది మన కళ్లారా చూసాము. చిన్నతనం నుండి వీళ్లిద్దరి సినిమాలు విడుదలైతే థియేటర్స్ క్యూలలో గంటల తరబడి నిల్చొని సినిమాలు చూసిన రోజులే గుర్తుకొస్తాయి వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా. అంతే కాదు టాప్ 4 హీరోలలో అత్యధిక రికార్డులు నెలకొల్పిన హీరోలు కూడా వీళ్లిద్దరు మాత్రమే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ హీరోలకు ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. సెంటిమెంట్ ని పండించడం లో కానీ, కడుపుబ్బా నవ్వించడం లో కానీ వీళ్లిద్దరికీ సాటీ ఎవ్వరూ రాలేరు. అలాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇన్నేళ్ల తమ కెరీర్ లో కలిసి ఎప్పుడూ స్క్రీన్ ని పంచుకోలేదు. తొలిసారిగా ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) కోసం వీళ్లిద్దరు కలిశారు. ఈ సంక్రాంతికి ఈ ఇద్దరు హీరోలు కలిసి వెండితెర పై సందడి చేయబోతున్నారు.

Also Read: ‘అఖండ 2’ ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి..? ఊహించనిది ఇది!

ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ని మేకర్స్ కొద్దిరోజుల క్రితమే తెలియజేసారు. రీసెంట్ గానే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక పాట చిత్రీకరణ కూడా పూర్తి అయ్యింది. దీంతో ఈ సినిమా వరకు వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ‘ఈరోజుతో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం లో నా పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. నా అభిమాన హీరో చిరంజీవి తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్న అద్భుతమైన అనుభూతి ని జీవితం లో మర్చిపోలేను. షూటింగ్ కి వచ్చిన మొదటి రోజు నుండి సరదాగా, సంతోషంగా సాగిపోయింది. నా జీవితంలో ఇవి ఒక అద్భుతమైన జ్ఞాపకాలు గా మిగిలిపోతాయి. చిరంజీవి గారితో కలిసి పనిచేయాలనే నా చిరకాల కోరిక ని అనిల్ రావిపూడి తీర్చాడు. సంక్రాంతిని మీ అందరితో కలిసి ఘనంగా జరుపుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

దీనికి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ ‘మై డియర్ వెంకీ..మై బ్రదర్, మా సినిమా కోసం నీ విలువైన పది రోజుల సమయాన్ని కేటాయించనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సెట్స్ లో నీ ప్రెజెన్స్ అద్భుతమైన సంతోషాన్ని, పాజిటివ్ ఎనర్జీ ని ఇచ్చింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి నువ్వు స్పెషల్ అట్రాక్షన్ ని జత చేసావు, నీతో కలిసి పనిచేసిన ప్రతీ మూమెంట్ ని నేను అద్భుతంగా ఎంజాయ్ చేసాను’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్. నిన్నటి తరం సూపర్ స్టార్స్ అయినటువంటి ఈ ఇద్దరు ఈ సంక్రాంతికి ఎలాంటి సునామీ ని సృష్టించబోతున్నారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper