Vijay Deverakonda- Rashmika Mandanna: రూమర్డ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ-రష్మిక మందాన ఒక స్పెషల్ అకేషన్ కోసం కలిశారు. గీత గోవిందం విడుదలై 5 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక చోటకు చేరారు. గీత గోవిందం తమకు ఎంతో స్పెషల్ అంటూ తెలియజేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందాన తమ ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ లో ఫోటోలు షేర్ చేశారు. హ్యాపీ మూమెంట్స్ ఫ్యాన్స్ తో పంచుకున్నారు. గీత గోవిందం సెలబ్రేషన్స్ లో దర్శకుడు పరశురామ్ సైతం పాల్గొన్నారు.
ఇక సదరు ఫోటోలు చూసిన ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక మందాన, విజయ్ దేవరకొండ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 2018 ఆగస్టు 15న గీత గోవిందం మూవీ విడుదలైంది. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. అత్యధిక లాభాలు తెచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
విజయ్ దేవరకొండకు అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం గీత గోవిందం. ఇక హీరోయిన్ గా రష్మిక మందాన నిలదొక్కుకున్నారు. గీత గోవిందం 5 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ఈ జంట పాల్గొనడం విశేషత సంతరించుకుంది. మరోసారి ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. కొన్నాళ్లుగా విజయ్ దేవరకొండ-రష్మిక మందాన డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
అందుకు వారి ప్రవర్తన కారణం అవుతుంది. పలుమార్లు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ విజయ్ దేవరకొండ-రష్మిక మందాన కనిపించారు. అలాగే రెండు పర్యాయాలు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. తాము జంటగా వెకేషన్ కి వెళ్లినట్లు రష్మిక ఒప్పుకుంది. మిత్రుడితో విహారానికి వెళితే తప్పేంటని ఆమె అన్నారు. ఎఫైర్ రూమర్స్ ని తరచుగా వీరు ఖండిస్తున్నా… సంథింగ్ సంథింగ్ అనే వాదన ఉంది.
View this post on Instagram