https://oktelugu.com/

Vijay Deverakonda: కెరీర్లో ఫస్ట్ టైం ఆ సాహసం చేస్తున్న దేవరకొండ.. ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్!

ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ కసిగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విజయ్ దేవరకొండ రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 11, 2024 / 02:05 PM IST

    Vijay Deverakonda dual role in VD14

    Follow us on

    Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఆయన క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నాడు. విజయ్ దేవరకొండ గత రెండు చిత్రాలు ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సమంతకు జంటగా నటించిన ఖుషి ఓ మోస్తరు విజయం అందుకుంది. ఫ్యామిలీ స్టార్ అయితే ప్లాప్ అని చెప్పాలి. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కనీసం ఓపెనింగ్స్ రాబట్టడంలో కూడా ఫెయిల్ అయ్యింది. నెగిటివ్ రివ్యూలు సినిమా వసూళ్లను బాగా దెబ్బతీశాయి.

    ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ కసిగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విజయ్ దేవరకొండ రెండు కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. మే 9 విజయ్ దేవరకొండ బర్త్ డే కాగా కొత్త ప్రాజెక్ట్స్ వివరాలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రొడ్యూసర్ దిల్ రాజుతో విజయ్ దేవరకొండ మరోసారి చేతులు కలిపాడు. దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కించనున్నారు. కత్తి పట్టుకున్న చేతితో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది.

    ‘కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే’ అంటూ ఒక కొటేషన్ జోడించారు. ప్రకటన పోస్టర్ తోనే దిల్ రాజు-విజయ్ దేవరకొండ ఆసక్తి రేపారు. బర్త్ డే వేళ విజయ్ దేవరకొండ మైత్రీ మూవీ మేకర్స్ తో కూడా ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ సైతం మైండ్ బ్లాక్ చేసింది. బీటలు వారిన నేలలో గుర్రంపై కత్తి పట్టుకుని వెళుతున్న వీరుడి శిల్పం ఉంది.

    విజయ్ దేవరకొండ 14వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకీర్త్యన్ దర్శకుడు. కాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇది పీరియాడిక్ యాక్షన్ డ్రామా అట. విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట. విజయ్ దేవరకొండ తండ్రి, కొడుకుగా కనిపిస్తాడనే న్యూస్ కాకరేపుతుంది. కాగా డ్యూయల్ రోల్ చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. తేడా కొడితే రిస్క్ అవుతుంది. ఇదే నిజం అయితే విజయ్ దేవరకొండ కెరీర్లో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసినట్లు అవుతుంది…