Vijay Deverakonda: టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల్లో ప్రభాస్, అల్లు అర్జున్ తప్ప, ఒక్కరు కూడా భారీ లైనప్ ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ముందుగా రామ్ చరణ్ విషయానికి వస్తే, ప్రసతుతం ‘పెద్ది’ చేస్తున్న ఆయన , తన తదుపరి చిత్రాన్ని ‘సుకుమార్’ తో చేస్తున్నాడు. ఆ తర్వాత ఎవరితో చేయబోతున్నాడు అనేది క్లారిటీ లేదు. ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ చిత్రం చేస్తున్న ఆయన , ఆ తర్వాత ఎవరితో చేయబోతున్నాడు అనే విషయం లో స్పష్టత లేదు. త్రివిక్రమ్ తో చేస్తాడని కొందరు , ‘దేవర 2’ చేస్తాడని మరికొందరు అంటున్నారు కానీ , అందులో ఏ ఒక్కటి ఖరారు అవ్వలేదు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ‘వారణాసి’ మినహా మరో సినిమా ఆయన ఇప్పటి వరకు ఒప్పుకోలేదు.
ఇక పవన్ కళ్యాణ్ విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఒప్పుకున్న మూడు చిత్రాలు పూర్తి చేశాడంటే . ఇప్పుడు ఆయన ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ రెడీ చేసుకొని పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాడు కానీ , ఇప్పటి వరకు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోపక్క సుజిత్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ రెడీ చేసాడు. ముందుగా ఏ సినిమా ప్రారంభం అవ్వబోతుంది అనేది ఎవరికీ తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వరకు ఈ విషయం లో క్లారిటీ వచ్చేలా లేదు. ఇక మీడియం రేంజ్ హీరోల్లో టాప్ స్థానం లో నాని విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ది ప్యారడైజ్’ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి. వీళ్లందరితో పోలిస్తే విజయ్ దేవరకొండ ది బెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఆయన ప్రకటించిన క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా జెన్ జీ డైరెక్టర్స్ అవ్వడం గమనార్హం.
‘శ్యామ్ సింగ రాయ్’ వంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ‘రాహుల్ సాంకృత్యాన్ ‘ తో ఆయన ‘రణబలి’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సమాంతరంగా రవి కిరణ్ కోలా అనే యంగ్ డైరెక్టర్ తో ‘రౌడీ జనార్ధన’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ‘స్వారీ’ అనే చిత్రం చేయబోతున్నాడు. ఇక నిన్న ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ ని తెరకెక్కించిన దర్శకుడు సౌరవ్ తో కలిసి ఒక పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే. ఈ రేంజ్ లైనప్ స్టార్ హీరోలు కూడా ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. వీటిల్లో ఏ ఒక్కటి హిట్ అయినా విజయ్ దేవరకొండ స్టార్ హీరోల జాబితాలోకి ఎంట్రీ ఇచ్చేస్తాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.