Rashmika Mandanna: రష్మిక మందన్నా హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయం అయింది. రష్మిక మందన్నాకి హిందీ ప్రేక్షకుల్లో ప్రస్తుతం ఫుల్ పాపులారిటీ ఉంది. ‘పుష్ప’ హిందీ వర్షన్ పెద్ద హిట్ కావడం, రష్మిక మందన్నా క్యారెక్టర్ బాగా పాపులర్ కావడం ఆమెకి కలిసొచ్చాయి. ఇప్పుడు హిందీలో రష్మిక మందన్నాకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అమితాబ్ తో కలిసి ఒక సినిమా చేస్తోంది.

అలాగే మిస్టర్ మజ్ను అనే హిందీ సినిమాలో కూడా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, తాజాగా రష్మిక మందన్నా ఇప్పుడు మరో హిందీ సినిమా చేయడానికి ఓకే చెప్పింది అని తెలుస్తోంది. మొత్తానికి రష్మిక మందన్నా బాలీవుడ్ లో బాగా హల్చల్ చేస్తోంది. మరి ముంబైలో రష్మిక ఇంత హంగామా చేయడానికి కారణం విజయ్ దేవరకొండ.
Also Read: Kanyakumari MP Pen Lost: ఎంపీగారి పెన్ను పోయిందా? విచారణ చేస్తున్న పోలీసులు
అవును.. రష్మిక మందన్నాకి హిందీలో ఛాన్స్ లు రావడం వెనుక విజయ్ హస్తం ఉందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండకి కరుణ్ జోహార్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. రష్మిక మందన్నాను కరుణ్ జోహార్ కి పరిచయం చేసింది విజయ్ దేవరకొండ అని.. ప్రస్తుతం రష్మిక హిందీ సక్సెస్ అసలైన కారకుడు విజయ్ అని టాక్ నడుస్తోంది.

ఇంతకీ విజయ్ తో రష్మిక మళ్లీ సినిమా ఎప్పుడు చేయనుంది అనే ప్రశ్న చాలా కాలంగా వినిపిస్తోంది. దానికి సమాధానం దక్కింది. రష్మిక మందన్నా హీరోయిన్ గా రూపొందే ఓ బాలీవుడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ గెస్ట్ గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నిర్మాత దినేష్ విజన్ తీసే కొత్త సినిమాలోనే రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది.
అయితే.. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా. ‘విక్కీ డోనర్’, ‘బాలా’ వంటి సినిమాల కథానాయకుడిగా ఆయుష్మాన్ ఖురానాకి మంచి ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి ఆయుష్మాన్ ఖురానా సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ సినిమా విజయ్ దేవరకొండ గెస్ట్ గా కూడా కనిపించనున్నాడు.
Also Read: Discontents in YCP: వైసీపీలో అసంతృప్తులు.. పెరుగుతున్న ధిక్కార స్వరాలు..!