https://oktelugu.com/

నాలుగో సీజన్‌ ‘బిగ్‌బాస్‌’గా విజయ్‌ దేవరకొండ

అసలు కన్నా కొసరే ఎక్కువన్నట్టు బిగ్‌బాస్‌ కంటెట్, కంటెస్టెంట్స్‌ స్టామినా కంటే షో ముందు వచ్చే పుకార్లే ఎక్కువగా ఉంటాయి. ఏ భాషలో అయినా బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ మొదలవుతుందంటే నెలల ముందు నుంచే అనేక ఊహాగానాలు స్టార్ట్‌ అవుతుంది. పబ్లిసిటీ స్టంటో, మరేదో తెలియదు గానీ వాటిపై బిగ్‌బాస్‌ యూనిట్‌ నుంచి ఎలాంటి క్లారిటీ ఉండదు. తెలుగులో మూడు ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన ఫస్ట్‌ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2020 / 01:40 PM IST
    Follow us on


    అసలు కన్నా కొసరే ఎక్కువన్నట్టు బిగ్‌బాస్‌ కంటెట్, కంటెస్టెంట్స్‌ స్టామినా కంటే షో ముందు వచ్చే పుకార్లే ఎక్కువగా ఉంటాయి. ఏ భాషలో అయినా బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ మొదలవుతుందంటే నెలల ముందు నుంచే అనేక ఊహాగానాలు స్టార్ట్‌ అవుతుంది. పబ్లిసిటీ స్టంటో, మరేదో తెలియదు గానీ వాటిపై బిగ్‌బాస్‌ యూనిట్‌ నుంచి ఎలాంటి క్లారిటీ ఉండదు. తెలుగులో మూడు ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన ఫస్ట్‌ సీజన్‌ చాలా ఆసక్తికరంగా సాగినా… నాని హోస్ట్‌గా వ్యవహరించిన సెకండ్‌ సీజన్‌ తేలిపోయింది. షో టైమ్‌లో, తర్వాత అనేక వివాదాలు తలేత్తాయి. లాభం లేదు నేనే వస్తున్నా అని థర్డ్‌ సీజన్‌కు మా టీవీ కో- ఓనర్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించాడు. తనదైన శైలిలో ఈ షోను హోస్ట్‌ చేసిన కింగ్‌ సీజన్‌ను ముందుండి నడిపించాడు. కంటెంట్‌ పరంగా షో పేలవంగా ఉన్నప్పటికీ నాగ్‌ క్రేజ్‌, మధ్యలో రమ్యకృష్ణ రూపంలో గెస్ట్‌ హోస్టింగ్‌, చిరంజీవి చేతుల మీదుగా క్లోజింగ్‌ సెర్మనీతో శుభం కార్డు పడింది.

    కేసీఆర్ కు ఏమైందో చెప్పాలని హైకోర్టులో పిటిషన్

    ఇప్పుడు కరోనా కారణంగా థియేటర్లు మూత పడడం, షూటింగ్స్‌ నిలిచిపోవడం.. తిరిగి ప్రారంభమైన షూటింగ్స్ స్పాట్స్‌లో కరోనా కలకలంతో తెలుగు సినీ, టీవీ పరిశ్రమలకు అడుగడుగునా అడ్డంకులు పడుతున్నాయి. పలువురు బుల్లితెర నటులకు కరోనా సోకడంతో సీరియల్స్‌ షూటింగ్స్‌ కూడా ఆగిపోయేలా ఉన్నాయి. ఇలాంటి టైమ్‌లో బిగ్‌బాస్ కొత్త ఎసిసోడ్‌ గురించి అనేక విశేషాలు బయటకొస్తున్నాయి. వీళ్లే కంటెస్టెంట్స్‌ అంటూ ఇప్పటికే ఓ లిస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు నాలుగో సీజన్‌ హోస్ట్ విషయంలో రోజుకో వార్త వస్తోంది. మళ్లీ తారక్ వస్తాడు.. లేదు నాగ్‌ కంటిన్యూ చేస్తాడు.. కాదు కాదు ఫస్ట్‌ టైమ్‌ లేడీ హోస్ట్‌గా సమంత తెరపైకి వస్తోందంటూ వార్తలు వినిపించాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు సెన్సేషనల్‌ స్టార్ విజయ్ దేవరకొండ పేరు చేరింది. ఉన్నదున్నట్టు బయటికి మాట్లాడే విజయ్‌ని హోస్ట్‌గా పెడితే యూత్‌, లేడీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ వస్తుందని, షో కూడా సూపర్ హిట్టవుతుందని నిర్వాహకులు భావించారట. అదే విషయాన్ని రౌడీ హీరోకి చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఎలాగో ఇప్పట్లో సినిమా షూటింగ్స్‌ జరిగేలా లేవు కాబట్టి.. ఈ ఖాళీ టైమ్‌లో బిగ్‌బాస్‌ షూట్‌లో పాల్గొనాలని అతడిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో విజయ్‌ నుంచి గానీ… బిగ్‌బాస్‌ యూనిట్‌ నుంచి గానీ ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ, విజయ్‌ హోస్టింగ్‌కు ఒప్పుకుంటే మాత్రం బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఓ రేంజ్‌లో దూసుకెళ్లడం ఖాయమని అతని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.