https://oktelugu.com/

జల్లికట్టు ఆడబోతున్న సూర్య

రియలిస్టిక్‌ స్టోరీస్‌ను తెరకెక్కించడంలో, అలాంటి చిత్రాల్లో నటించడంలో కోలీవుడ్‌ దర్శకులు, హీరోలు ముందుంటారు. ఆ కోవకు చెందిన వాళ్లే డైరెక్టర్ వెట్రిమారన్, సూపర్ స్టార్ సూర్య. గతేడాది ధనుష్‌ హీరోగా వచ్చిన ‘అసురన్‌’తో వెట్రిమారన్‌ భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఒక్క తమిళ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల వాళ్లు రీమేక్ రైట్స్‌ కోసం పోటీ పడ్డారు. తెలుగులో ఆ అవకాశం సురేశ్‌ బాబు దక్కించుకోగా… తన తమ్ముడు విక్టరీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2020 1:26 pm
    Follow us on


    రియలిస్టిక్‌ స్టోరీస్‌ను తెరకెక్కించడంలో, అలాంటి చిత్రాల్లో నటించడంలో కోలీవుడ్‌ దర్శకులు, హీరోలు ముందుంటారు. ఆ కోవకు చెందిన వాళ్లే డైరెక్టర్ వెట్రిమారన్, సూపర్ స్టార్ సూర్య. గతేడాది ధనుష్‌ హీరోగా వచ్చిన ‘అసురన్‌’తో వెట్రిమారన్‌ భారీ హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీ ఒక్క తమిళ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అన్ని భాషల వాళ్లు రీమేక్ రైట్స్‌ కోసం పోటీ పడ్డారు. తెలుగులో ఆ అవకాశం సురేశ్‌ బాబు దక్కించుకోగా… తన తమ్ముడు విక్టరీ వెంకటేశ్‌ హీరోగా ‘నారప్ప’ టైటిల్‌తో రీమేక్‌ చేస్తున్నాడు. సహజత్వానికి దగ్గర ఉండే కథలతో సినిమాలు చేసే వెట్రిమారన్‌ ఇప్పుడు సూర్యతో మరో ఇంట్రస్టింగ్‌ మూవీ తీస్తున్నాడు. ‘అసురన్‌’ నిర్మాత కలైపులి థాను నిర్మాతగా జల్లికట్టు బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేశాడు. ‘వాడివాసల్‌’ అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో సూర్య తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. జల్లికట్టు ఆటలో తన తండ్రిని చంపిన ఎద్దును మచ్చిక చేసుకోవడమే నవలలో ప్రధానాంశం. దాని ఆధారంగా సినిమాకు తగ్గ మార్పులతో పక్కా స్క్రి ప్ట్‌ తయారు చేశారు డైరెక్టర్. డైలాగ్స్‌ మాత్రం ఎక్కవ నవలలోనివే ఉంటాయట.

    జివికె రెడ్డి వ్యాపారాలపై సిబిఐ దాడుల వెనక అసలు ఉద్దేశం ?

    తండ్రి, కొడుకుగా డ్యుయల్‌ రోల్‌ చేయడం సూర్యకు కొత్తేం కాకపోయినా ఈ మూవీకి తగ్గట్టుగా మేకోవర్ అవుతున్నాడు. రెండు పాత్రల్లోనూ ఎద్దులతో కుమ్ములాట ఉంటుంది కాబట్టి.. జల్లికట్టు ఆటగాడిగా తన శరీరాన్ని తీర్చిదిద్దుకునే పనిలో ఉన్నాడు. షెడ్యూల్‌ ప్రకారం గత నెలలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లాలి. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. అసురన్‌ యూనిట్‌ నుంచి వస్తున్న సినిమా, పైగా స్టార్ హీరో సూర్య కాబట్టి ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా జల్లికట్టు ఆటగాడిగా సూర్య పెర్ఫామెన్స్‌ ఎలా ఉంటుందని అతని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఉన్నారు.