Vijay Deverakonda Rashmika wedding rules: ఈ నెల 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళ పెళ్లి గురించి అందరికీ తెలిసినప్పటికీ కూడా, అధికారికంగా ప్రకటించడానికి ఏమాత్రం ఇష్టం చూపడం లేదు. రీసెంట్ గానే రష్మిక ముంబై విమానాశ్రయం లో కనిపించినప్పుడు, పెళ్లి చేసుకోబోతున్నందుకు శుభాకాంక్షలు ఒక రిపోర్టర్ తెలియజేయగా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదంటూ అమాయకంగా సమాధానం చెప్పడం సోషల్ మీడియా లో ట్రోల్స్ కి గురయ్యేలా చేసింది. ఆమె అలా చెప్పిన రోజు సాయంత్రమే విజయ్ దేవరకొండ తో కలిసి ఒకే కారులో షాపింగ్ కి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. మరో పక్క ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి.
ఈ పెళ్లిని ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా, తమ కుటుంబ సభ్యులు, మిత్రుల సమక్ష్యంలో రహస్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ పెళ్ళికి వచ్చే అతిథులకు ఈ జంట పెట్టిన కఠినమైన రూల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పెళ్ళికి వచ్చే అతిథులు మొబైల్ ఫోన్లు తీసుకొని రాకూడదు అట. ఎందుకంటే ఎవరో ఒకరు ఫోటోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం, అవి వైరల్ అవ్వడం వంటివి జరుగుతున్నాయి కాబట్టి, ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అతిథి దేవో భవ అని పెద్దలు అంటుంటారు. అలాంటి అతిథులకు ఇలాంటి ఆంక్షలు పెట్టడం ఏంటి?, రిక్వెస్ట్ చేయడం వరకు ఓకే, ఇలా రూల్స్ పెట్టడం మాత్రం చాలా టూ మచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అంతే కాదు ఈ పెళ్ళికి వచ్చే ఫోటో గ్రాఫర్ తో కూడా సోషల్ మీడియా లో పెట్టకూడదు అని అగ్రిమెంట్ చేసుకున్నారట.
అంతే కాదు, ఈ పెళ్లికి ఒక్క సెలబ్రిటీ ని కూడా ఆహ్వానించలేదట. ప్రతీ సినీ సెలబ్రిటీ , రాజకీయ నాయకులను కలిసి పెళ్లి శుభ లేఖలు ఇచ్చారట, కానీ అది కేవలం రిసెప్షన్ కి మాత్రమే రావాల్సిందిగా కోరారట. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, తాజ్ కృష్ణ లో మార్చి 4 న వీళ్లిద్దరి రిసెప్షన్ వేడుక జరగనుంది. సాయంత్రం 7 గంటల నుండి ఈ వేడుక మొదలు అవుతుందట. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులూ, ఇలా అందరూ ఈ రిసెప్షన్ వేడుక కి హాజరు కాబోతున్నారు. ఇది తెలుసుకున్న నెటిజెన్స్ వాళ్లకు కూడా ‘నో మొబైల్ పాలసీ’ ని పెట్టారా అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.