Vijay Deverakonda And Rashmika Wedding: టాలీవుడ్ లో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) లు ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని. గత మూడు నాలుగేళ్లుగా ఈ వార్త వినిపిస్తూనే ఉంది. విజయ్ దేవరకొండ మొదట్లో ఫేక్ న్యూస్ అని కొట్టి పారేసేవాడు. కానీ ఇప్పుడు అసలు స్పందించడం లేదు. ఇక రష్మిక అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం పై సమయం వచ్చినప్పుడు నేనే మాట్లాడుతాను అని చెప్పుకొచ్చింది. అంటే ఆ వార్త నిజమే అని అనధికారికంగా రష్మిక ఒప్పుకున్నట్టే. ఈ జంటకు గత ఏడాది నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఫిబ్రవరి నెలలో పెళ్లి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపించిన వార్త. కానీ ఇప్పుడు ఆ వార్త నూటికి నూరు శాతం నిజమే అని తెలుస్తోంది.
వచ్చే నెల 26న , అనగా ఫిబ్రవరి 26న ఈ క్రేజీ జంట మూడు ముళ్ల బంధం తో శాశ్వతంగా ఒక్కటి కాబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం పూర్తి అయ్యిందట. త్వరలోనే ఈ జంట ఈ విషయాన్నీ అధికారికంగా అభిమానులకు ప్రకటించే అవకాశం ఉంది. ఈ వివాహాన్ని ఉదయ్ పూర్ లో జరిపించనున్నారు అట. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల పెళ్లి ఉదయ్ పూర్ లోని ఒక ప్యాలస్ లో ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అదే ప్యాలస్ లో ఈ క్రేజీ జంట వివాహం కూడా జరగబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పెళ్ళికి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు తక్కువగానే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరు కుటుంబ సభ్యులు, అదే విధంగా ఇద్దరికీ ఎంతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వివాహ మహోత్సవానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
గీత గోవిందం చిత్రం తో వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా పెద్ద హిట్ కూడా అయ్యింది. అప్పట్లో ఏర్పడిన స్నేహం, ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తో ప్రేమగా మారింది. ఇక ఆ తర్వాత కొన్నేళ్ల నుండి ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేస్తున్న ఈ చిత్రం, రీసెంట్ గా కలిసి ‘రణబలి’ చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. నిన్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో కూడా విడుదలై అద్బుత్యమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. వచ్చే నెలతో ఈ సినిమాలోని రష్మిక పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందట. అందుకే పెళ్ళికి సిద్దమయినట్టు తెలుస్తోంది. మరి పెళ్లి తర్వాత రష్మిక సినిమాలు చేస్తుందా , లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఫిబ్రవరి 26 విజయ్ దేవరకొండ,
రష్మిక వివాహం ఉదయ్ పూర్ లో
అని సమాచారం?#Tollywood— Kakinada Talkies (@Kkdtalkies) January 27, 2026