Aamir Khan Peddi Movie: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మాత్రమే ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ మూవీస్ ప్లాప్ అయిన వల్ల తో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు…ప్రస్తుతం స్టార్ హీరోలు పాన్ ఇండియాలో మన సినిమాలను ముందుకు తీసుకెళుతున్న క్రమంలో బాలీవుడ్ హీరో లను ఎవరు పట్టించుకోవడం లేదు. దాంతో వాళ్ళు కొంతవరకు డీలా పడిపోయారు. ప్రస్తుతం ఖాన్ త్రయం గురించి అయితే ఎవరు మాట్లాడటం లేదు. ఇక ఇప్పుడు వస్తున్న సినిమాలతో వాళ్ళేదైనా మ్యాజిక్ చేస్తేనే తప్ప ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ పేరు వినిపించే అవకాశాలైతే లేవు. ఒకప్పుడు మిస్టర్ పర్ఫాక్షనిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అమీర్ ఖాన్ సైతం ఇప్పుడు సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటాడు. ముఖ్యంగా ఇప్పుడు ఆయనకు ఇన్ఫియార్టీ కాంప్లెక్స్ ఎక్కువగా పెరిగిపోయింది.
తెలుగు హీరోలు చేసే సినిమాలకంటే కలెక్షన్స్ తక్కువగా వస్తే ఎలా అనే ఒక డైలామాలో తాను ఉన్నాడు. అందుకోసమే తన సినిమాలేవి చేయకుండా మంచి కథ కోసం వెతుకుతున్నాడు… ఇక కూలీ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసినప్పటికి అది అతనికి ఏ మాత్రం యూస్ కాలేదు.
పైగా ఆ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నాడు అంటూ చాలా మంది నుంచి విమర్శలను కూడా మూట గట్టుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఇక మీదట ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉండాలి గానీ డిస్కారేజ్ చేసే విధంగా ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నాడు.
ఇక కొంతమంది తెలుగు దర్శకులైతే మన సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించమని అడుగుతున్నప్పటికి అమీర్ ఖాన్ మాత్రం వినడం లేదట. ఎందుకంటే కూలీ సినిమాతో ఎదురైన దెబ్బ ను అతను ఇప్పటికి మర్చిపోవడం లేదు… దాంతో రామ్చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం అమీర్ ఖాన్ ని అడిగినప్పటికి ఆయన నిరాకరించినట్టుగా తెలుస్తుంది…