Vijay Deverakonda: యూత్ ఐకాన్ అంటూ విజయ్ దేవరకొండను బాగా ప్రమోట్ చేసింది తెరాస పార్టీనే. కారణం తెలంగాణ ప్రభుత్వం పెద్దలది, విజయ దేవరకొండది ఒక్కటే కులం అని, అందుకే, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో కొంతవరకు గుర్తింపు తెచ్చుకోగానే, అతనికి భారీ సపోర్ట్ ఇచ్చి.. అతని సినిమాల స్థాయిని, అతని ఇమేజ్ స్థాయిని పెంచింది కేటీఆర్ అని ఒక రూమర్ ఉంది.

అయితే, ఆ రూమర్ నిజమే అన్నట్టు.. విజయ్ దేవరకొండ కూడా ఎప్పటికప్పుడు తన స్వామి భక్తిని నిరూపించుకుంటూనే వస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ బాగు కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తాను ఫిదా అయినట్టు విజయ దేవరకొండ సోషల్ మీడియాలో మెసేజ్ చేశాడు. ఇంతకీ ఆ మెసేజ్ సారాంశం ఏమిటంటే..
“తెలంగాణలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్పగా కృషి చేస్తూ.. ఇండస్ట్రీని అద్భుతంగా ఆదుకుంటుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ దేశంలో రెండో అతిపెద్ద చిత్ర పరిశ్రమ. అయితే, కరోనా సంక్షోభ కాలంలో బాగా దెబ్బతింది. ఈ క్రమంలో థియేటర్ల వ్యవస్థకి సపోర్ట్ గా ప్రభుత్వం నిలవడం గొప్ప శుభ పరిణామం’ అంటూ విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో ఒక లెటర్ పోస్ట్ చేశాడు.
Also Read: విజయ్ దేవరకొండలో ఏం చూశారు బ్యూటీస్?… అందరూ ఆయనే కావాలంటున్నారు!
ఆ లెటర్ లో ఇంకా ఇంకొంత మెసేజ్ ను పోస్ట్ చేస్తూ.. ‘సినిమా టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప సపోర్ట్. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎంత గొప్పగా కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు మంత్రులు కేటీఆర్ గారు రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి కోసం ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారు’ అంటూ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో పొగడ్తల వర్షం కురిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం పై ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం పై ప్రేమను కనబర్చాడు.
మరి విజయ్ దేవరకొండకి – కేసీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం పై కూడా ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఇలా స్పందించడంతో ఆ కథనాలకు బలం చేకూర్చినట్లు అయింది.
Also Read: మరపురాని మేటి నటుడు అచ్యుత్