టాలీవుడ్ లో విజయ్ దేవరకొండనే టాప్

యాంగర్ మేనేజ్ మెంట్ లో తోపు అయిన హీరో విజయ్ దేవరకొండ. అతడి యాటిట్యూడ్, భాష, వేషధారణ సినిమాకు ప్రాణం పోస్తుంది. అదే ఇప్పుడు అతడిని స్టార్ హీరోను చేసింది. మిగతా యంగ్ హీరోలందరి కంటే అతడిని భిన్నంగా నిలబెట్టింది. టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ 2020 సంవత్సరానికి ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చాలా మంది అగ్రశ్రేణి హీరోలను పక్కనపెట్టి, విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి టైటిల్‌ను దక్కించుకోవడం […]

Written By: NARESH, Updated On : June 2, 2021 1:20 pm
Follow us on

యాంగర్ మేనేజ్ మెంట్ లో తోపు అయిన హీరో విజయ్ దేవరకొండ. అతడి యాటిట్యూడ్, భాష, వేషధారణ సినిమాకు ప్రాణం పోస్తుంది. అదే ఇప్పుడు అతడిని స్టార్ హీరోను చేసింది. మిగతా యంగ్ హీరోలందరి కంటే అతడిని భిన్నంగా నిలబెట్టింది.

టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ 2020 సంవత్సరానికి ‘హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్’ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. చాలా మంది అగ్రశ్రేణి హీరోలను పక్కనపెట్టి, విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి టైటిల్‌ను దక్కించుకోవడం విశేషంగా మారింది.

యాక్టింగ్ తోపాటు ఈ నటుడు సోషల్ మీడియా సర్కిల్స్‌లో కూడా భారీ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మొదటి దక్షిణ భారతీయ నటుడు విజయ్ దేవరకొండనే కావడం విశేషం. కేవలం మూడేళ్లలోనే అతను దానిని సాధించాడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి 2020 సంవత్సరానికి అత్యంత ఇష్టపడే హీరోల జాబితాలో రామ్ రెండో స్థానంలో నిలిచాడు. అతని తరువాత ఎన్టీఆర్ ఉన్నారు.

విజయ్ దేవరకొండ రాబోయే రెండేళ్ళలో పెద్ద సినిమాలే చేస్తున్నాడు. ఆసక్తికరమైన ప్రాజెక్టులను కలిగి ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ తో తన అదృష్టాన్ని దేశవ్యాప్తంగా మళ్లీ పరీక్షించడానికి సిద్దమయ్యాడు.