
లాక్ డౌన్ల ఎత్తివేత ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని ఐసీఎంఆర్ సూచించింది. కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ తెలిపారు. ఇందుకోసం ఆయన మూడు అంశాల ప్రణాళికను సూచించారు. తక్కువ పాజిటివిటీ రేటు, అత్యధిక మందికి టీకాలు, కొవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తన వంటి అంశాలను రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకుని లాక్ డౌన్ల సడలింపులపై నిర్ణయం తీసుకోవాలన్నారు.