Vijay Devarakonda- Parashuram: విజయ్ దేవరకొండ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. గీత గోవిందం రేంజ్ హిట్ మరలా పడలేదు. టాక్సీవాలా పర్లేదు అనిపించినా క్లీన్ హిట్ కాలేకపోయింది. అంటే 2018 తర్వాత విజయ్ దేవరకొండ సక్సెస్ తలుపు తట్టలేదు. ఈమధ్యలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు విడుదలయ్యాయి. విజయ్ దేవరకొండ మూవీ అనగానే యూత్ లో ఒకరకమైన హైప్ ఏర్పడుతుంది. పెద్దగా ప్రమోట్ చేయకున్నా ఫస్ట్ డే యూత్ థియేటర్స్ కి క్యూ కడతారు. అయితే విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ నిరాశపరిచాయి.

ఇక లైగర్ ఇచ్చిన షాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లైగర్ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ప్రమోషనల్ ఈవెంట్లో గట్టిగా కొడుతున్నాం అంటూ… దర్శకుడు పూరి, హీరో విజయ్ విజయ్ దేవరకొండ విశ్వాసం వ్యక్తం చేశారు. తీరా మూవీ విడుదలయ్యాక కంటెస్టెంట్ లేదని ప్రేక్షకులు తేల్చేశారు. కథ, ఎమోషన్స్ లేకుండా కేవలం యాక్షన్ సన్నివేశాల కోసం మూవీ తీసినట్లు అనిపించింది. లైగర్ హిట్ కొడితే విజయ్ దేవరకొండ ఫేట్ మారిపోయేది. ఆల్ ఇండియా ఆయన పేరు మారుమ్రోగేది.
లైగర్ వైఫల్యం కారణంగా మొదలుపెట్టిన జనగణమన ఆగిపోయింది. ఈడీ అధికారుల విచారణ విజయ్ దేవరకొండ ఎదుర్కోవాల్సి వచ్చింది. పూరి అగ్రిమెంట్ చేసుకున్న రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదనే టాక్ వినిపించింది. టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో నెక్స్ట్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి. కాగా ఆయనకు బంపర్ హిట్ ఇచ్చిన పరుశురామ్ తో మూవీ సెట్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

పరుశురామ్ మహేష్ తో చేసిన సర్కారు వారి పాట హిట్ స్టేటస్ అందుకుంది. అయినప్పటికీ ఆయనతో చేయడానికి ఒక్క స్టార్ హీరో కూడా ఖాళీగా లేరు. అందరూ ఒకటికి రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టారు. రవితేజతో చేద్దామన్నా కూడా ఆయన మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో మూవీకి సిద్ధం అయ్యారని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖాళీగా ఉన్నారు. సమంత హెల్త్ రీజన్స్ తో ఖుషి షూటింగ్ కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు. కాబట్టి ఈ కాంబో సెట్ అయ్యిందంటున్నారు. అధికారిక ప్రకటన త్వరలో రానుందట.