సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా పైకి రావాలంటే పెట్టి పుట్టాలి. అలా పెట్టి పుట్టినోడే విజయ్ దేవరకొండ. జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలైన ప్రయాణం.. రెండో స్టెప్ లోనే హీరోగా, మూడో స్టెప్ లోనే స్టార్ గా మారిపోయింది. ఇక ఈ క్రేజీ స్టార్ తనకు దొరికిన ఈ గ్యాప్ గురించి ఫన్నీగా చెప్పుకొచ్చాడు. లాక్ డౌన్ కి ముందు తన మనసులో ఎప్పుడూ ఒక్కటే ఉండేదట. తనకు రెస్ట్ దొరికితే బావుండు అని చాలాసార్లు మనసులో అనుకున్నేవాడట. తన ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడూ ఇదే విషయం గురించి చెబుతుండే వాడట. పైగా తానూ సినిమాల నుండి ఓ ఏడాది రెస్ట్ తీసుకుంటానని, ఓ మూడేళ్ల తర్వాత సినిమాలు ఆపేస్తానని కూడా చెప్పేవాడట.
Also Read: అఖిల్ ఎలిమినేషన్.. మరోసారి దొరికిన బిగ్ బాస్
అయితే తానూ అన్న ఈ మాటలను బహుశా దేవుడు విన్నాడేమో.. అందుకే నాకు ఏడాది పాటు పనిలేకుండా చేశాడు అంటూ విజయ్ దేవరకొండ మరీ అమాయికంగా చెప్పుకొచ్చాడు. మనోడి మాటలు చాల ఓపెన్ గా ఉంటాయి. మరి అలా ఉండాలని ప్లాన్ చేసుకుని ముందే స్క్రిప్ట్ ప్రిపేర్ అయి వస్తాడో లేదో తెలియదు గానీ, మొత్తానికి తానూ ఓ కొత్తరకం హీరోను అనేలా తనను తానూ బాగానే ఎలివేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ లాక్ డౌన్ వచ్చి తనకు వద్దన్నా రెస్ట్ దొరికిందని చెబుతున్నాడు. మొదట్లో మొదటి 2 నెలలు బాగా ఆనందంగా ఉందట. ఆ టైంలో ఫుల్ గా ఎంజాయ్ చేశానని కూడా చెప్పుకొచ్చాడు.
Also Read: సమంత సామ్-జామ్..అన్ని కలిపేసి కిచిడిలా మారిందా?
అయితే లాక్ డౌన్ మొదలైన మూడో నెల నుంచి తనకు బాగా బోర్ కొట్టడం స్టార్ట్ అయిందని.. ఈ లాక్ డౌన్ వల్ల తన కెరీర్ లో చాలా టైమ్, డబ్బు వేస్ట్ అయిపోయాయని.. ప్రస్తుతం తన మైండ్ లో ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్దామా అని ఉందని తెలిపాడు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ షూటింగ్ కోసం మళ్ళీ ఆశగా ఎదురుచూస్తున్నాడు అన్నమాట. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా 40 శాతం పూర్తి అయింది. లాక్డౌన్ తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ చెయ్యలేదు. డిసెంబర్ నుండి షూటింగ్ అనుకుంటున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్