తల్లికి వోడ్కా తాగిస్తున్న వర్మ !

వివాదం అనే పదానికి పర్యాయపదంలా మారిపోయాడు ‘రామ్ గోపాల్ వ‌ర్మ‌’. నిజానికి ఈ పేరు వింటేనే ఓ సంచ‌ల‌నంలా అనిపిస్తుంటుంది కొంతమందికి. కానీ మెజార్టీ జనానికి వర్మ అర్ధం కాని బ్రహ్మపదార్థం. వర్మ చేసే ప‌నులు అన్నీ అలాగే ఉంటాయి. అయినా తన చేష్టలతో మ‌రిన్ని వివాదాల‌ని సృష్టించడానికి వర్మ, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటాడు. అందులో క్రమంగా ఒక్కోసారి హద్దులు కూడా దాటుతూ తనకు తానే సాటి అనిపించుకునేలా ఉంటుంది వర్మ దూకుడు. ఇక […]

Written By: admin, Updated On : November 15, 2020 5:35 pm
Follow us on


వివాదం అనే పదానికి పర్యాయపదంలా మారిపోయాడు ‘రామ్ గోపాల్ వ‌ర్మ‌’. నిజానికి ఈ పేరు వింటేనే ఓ సంచ‌ల‌నంలా అనిపిస్తుంటుంది కొంతమందికి. కానీ మెజార్టీ జనానికి వర్మ అర్ధం కాని బ్రహ్మపదార్థం. వర్మ చేసే ప‌నులు అన్నీ అలాగే ఉంటాయి. అయినా తన చేష్టలతో మ‌రిన్ని వివాదాల‌ని సృష్టించడానికి వర్మ, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటాడు. అందులో క్రమంగా ఒక్కోసారి హద్దులు కూడా దాటుతూ తనకు తానే సాటి అనిపించుకునేలా ఉంటుంది వర్మ దూకుడు. ఇక ఎప్పుడు వోడ్కా, అమ్మాయిల‌తో క‌లిసి ఎంజాయ్ చేసే వ‌ర్మ, రీసెంట్ గా త‌న సోష‌ల్ మీడియాలో తన తల్లి సోదరితో కలిసి దిగిన ఫోటోలను పెట్టాడు.

Also Read:  సినిమాలు ఆపేస్తానని చెప్పేవాడట !

మాములు ఫోటోలు అయితే.. కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమోగానీ, కాస్త ఆ ఫొటోలో ఓ గ్లాస్ వోడ్కాని కూడా చేర్చాడు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. దీవాళి బోరింగ్ పోగ‌ట్ట‌డానికి మా అమ్మ‌ని వోడ్కా సిప్ చేయ‌మ‌ని చెబుతున్నాను అంటూ కామెంట్ కూడా పెట్టాడు. దాంతో వ‌ర్మ నీ పిచ్చి పీక్స్ కు చేరిన‌ట్టుంద‌య్యా అంటూ నెటిజ‌న్స్ తమ‌కు తోచిన కామెంట్స్ రాస్తూ వర్మను తెగ తిట్టిపోస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం నువ్వు మాములోడివి కాదు వ‌ర్మ అని సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి వర్మ తాగేది స‌రిపోక ఆయన తల్లిని కూడా తాగిస్తున్నాడా అంటూ మరికొందరు మండిప‌డుతున్నారు.

Also Read: హనీమూన్ లోనూ కాజల్ సంపాదన ఆగట్లేదు !

ఎవ్వరు ఎన్ని అన్నా.. ఏ మాత్రం పట్టించుకోనివాడే రామ్ గోపాల్ వర్మ. సో.. వర్మ అంతే. తనకు న‌చ్చ‌ని వారి పై బ‌యోపిక్‌లు తీయ‌డం, య‌దార్ద ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినిమాలు చేస్తూ కాంట్ర‌వ‌ర్సీస్ చేయ‌డం వ‌ర్మ‌కు ఎలా అల‌వాటునో.. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్త‌ల‌లో నిలవడం కూడా అంతే అలవాటు.. పైగా మహా సరదా కూడా. పైగా రామ్ గోపాల్ వ‌ర్మకు మొహ‌మాటం, సిగ్గు, భ‌యం లాంటివి ప‌రిచ‌యం లేవు గనుక, వర్మను అలా వదిలేయడమే బెటర్. ఇక వ‌ర్మ ప్ర‌స్తుతం దిశా ఎన్‌కౌంట‌ర్, మ‌ర్డ‌ర్ అనే చిత్రాల‌ని చేస్తున్నాడు. అనేక స‌మస్య‌లు ఈ చిత్రాల‌ని చుట్టుముడుతున్న‌ప్ప‌టికీ ,వాటిని త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్