Vijay Devarakonda : టాలీవుడ్ పోలవరం ప్రాజెక్ట్ గా పిలవబడే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనేది నిర్మాత AM రత్నం కి కూడా తెలియదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మే9 న విడుదల అవుతుందని కొంతకాలం క్రితమే అధికారిక ప్రకటన చేసారు. కానీ అది సాధ్యం కాదని స్పష్టంగా అర్థం అయిపోయింది. అయినప్పటికీ బుక్ మై షో లో ఇంకా విడుదల తేదీని తొలగించలేదు. రెండు మూడు రోజుల్లో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు బయ్యర్స్ కి ఒక సందేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ సినిమా మొత్తం సిద్ధంగా లేదు, పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇంకా నాలుగు రోజుల డేట్స్ అవసరం ఉన్నది. అదే విధంగా కొన్ని సీజీ షాట్స్ రావాల్సి ఉందట. ఈ రెండిట్లో జాప్యం జరగడంతో మేకర్స్ విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నారు.
అయితే నిర్మాత రత్నం బయ్యర్స్ కి మే30 న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అదే తేదీన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం వస్తుందని ఆ చిత్ర నిర్మాత నాగవంశీ ప్రకటించి రెండు నెలలు దాటింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని అదే తేదీన విడుదల చేస్తామని నిర్మాత రత్నం కచ్చితంగా చెప్తే, తమ సినిమాని వాయిదా వేసుకుంటామని నిర్మాత నాగ వంశీ అంటున్నాడట. కానీ రత్నం నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. నేడు కింగ్డమ్ మూవీ నుండి మొదటి పాట విడుదలైంది. ఈ పాటకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ లో కూడా మే30 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రింట్ వేశారు. ఆ మూవీ టీం ప్రొమోషన్స్ విషయం లో ఇక ఆగేది లేదు అనే విధంగా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంది.
Also Read : అక్షరాలా 37 వేల కోట్ల లాభాలు..రాబోయే రోజుల్లో ఓటీటీ లదే రాజ్యం!
‘హరి హర వీరమల్లు’ కోసం ఒకవేళ ఈ సినిమాని వాయిదా వేస్తే కేవలం వారం, లేదా రెండు వారాలు మాత్రమే వేస్తారు. ఎటు చూసినా దగ్గర్లోనే విడుదల తేదీ ఉంటుంది కాబట్టి ప్రొమోషన్స్ ఆగవట. అయితే మే 30 న సినిమా వస్తుందో లేదో తెలియాలంటే పవన్ కళ్యాణ్ నుండి రెస్పాన్స్ రావాలి. ఆయన ఈ వారం లో ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి నాలుగు రోజుల డేట్స్ కేటాయిస్తే మే 30న ‘హరి హర వీరమల్లు’ వస్తుంది. లేకపోతే ‘కింగ్డమ్’ వస్తుంది. ఈ చిక్కు ముడి తొందరగా వీడాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రంగం లోకి దిగాల్సిందే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్నో ఏళ్ళ నుండి చూస్తున్నాడు కాబట్టి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.