OTT platforms growth : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ ని ఓటీటీ ఏ రేంజ్ లో డామినేట్ చేస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారి ఓటీటీ సంస్థల పాలిట దేవత లాగా మారిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆడియన్స్ కొత్త రకమైన సినిమాలు వస్తే థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు కానీ, రొటీన్ కమర్షియల్ సినిమాలు వస్తే మాత్రం,ఓటీటీ లో వచ్చినప్పుడు చూసుకోవచ్చు లే అనే ధోరణికి వచ్చేసారు. ఇక చిన్న హీరోల సినిమాలు అయితే సూపర్ హిట్ టాక్, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే థియేటర్స్ కి కదులుతున్నారు కానీ, యావరేజ్ రేంజ్ టాక్ వస్తే మాత్రం అసలు కదలడం లేదు. ఓటీటీ లో వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024 వ సంవత్సరం లో ఓటీటీ సంస్థలు అన్నిటికి కలిపి 37 వేల కోట్లకు పైగా లాభాలు వచ్చాయట. ఒక సంవత్సరం లో ఇంత లాభాలు అంటే సాధారణమైన విషయం కాదు.
ప్రస్తుతం ఉన్న ఓటీటీ సంస్థల్లో అత్యధిక లాభాలు వచ్చిన ఓటీటీ సంస్థలు ఏంటో ఒకసారి వివరంగా చూద్దాము.
యూట్యూబ్(Youtube) :
సిటీ జనాల నుండి, పల్లెటూరి జనాల వరకు ప్రతీ ఒక్కరు కామన్ గా ఉపయోగించే యాప్ ఇది. ఈ యాప్ కి యాడ్స్ మరియు సబ్ స్క్రైబర్స్ రెవిన్యూ కలిపి 2024 వ సంవత్సరం లో 14,300 కోట్ల రూపాయిలు వచ్చాయట. ఒక రాష్ట్రాన్ని నెల రోజుల పాటు ఈ డబ్బులతో రన్ చెయ్యొచ్చు, ఆ రేంజ్ లాభాలు ఇది.
జియో సినిమా(Jio Cinema):
క్రికెట్, రియాలిటీ షోస్, సరికొత్త సినిమాలు, ఎంటర్టైన్మెంట్ షోస్, డ్యాన్స్ షోస్, ఇలా అన్నిట్లో అగ్రగామిగా నిలిచే ఈ ఓటీటీ సంస్థకు ఏకంగా 11,835 కోట్ల రూపాయిల లాభాలు గత సంవత్సరం లో వచ్చాయట.
ఇక మిగిలిన ఓటీటీ సంస్థలను పరిశీలిస్తే మన ఇండియా లో అత్యధికంగా వినియోగించే ఓటీటీ యాప్స్ లో ఒకటి డిస్నీ + హాట్ స్టార్(Disney + Hotstar). ఇప్పుడు దీనిని జియో సంస్థ కొనుగోలు చేసింది కానీ, గత ఏడాది ఈ యాప్ సోనీ సంస్థలలో అంతర్భాగం. గత ఏడాది ఈ సంస్థ కు దాదాపుగా 2750 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయట. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ కు 2900 , అమెజాన్ ప్రైమ్ సంస్థకు 1200 కోట్లు, ఆహా మీడియా కి 148 కోట్లు, సోనీ లివ్ సంస్థకు 300 కోట్లు, జీ5 సంస్థకు 237 కోట్లు, మరియు ఇతర ఓటీటీ సంస్థలకు కలిపి 4270 కోట్లు, మొత్తం మీద అన్ని ఓటీటీ సంస్థలకు కలిపి 37,940 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి. ఇది ఒక చరిత్ర అని చెప్పొచు. రాబోయే రోజుల్లో ఇంకా ఏ రేంజ్ లాభాలను ఈ ఓటీటీ సంస్థలు ఆర్జిస్తాయో చూడాలి.