Rashmika Mandanna Comments: అక్టోబర్ 3న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంట నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీళ్లిద్దరి పేర్లే ట్రెండింగ్ లో ఉంటున్నాయి. నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అవుతున్న వీళ్ళ నిశ్చితార్ధ వేడుక గురించి ఇప్పటి వరకు ఎలాంటి విజయ్ దేవరకొండ నుండి కానీ, రష్మిక నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ విషయాన్నీ వీళ్ళు కొన్నాళ్ళు గోపంగానే ఉంచాలని ఫిక్స్ అయ్యినట్టు ఉన్నారంటూ సోషల్ మీడియా లో అభిమానులు కూడా అర్థం చేసుకున్నారు. ఇదంతా పక్కన పెడితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్న ఈ సమయం లో తన కాబోయే వరుడు గురించి రష్మిక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రిలీజ్ సందర్భంగా ఒక పాపులర్ పోడ్ క్యాస్ట్ ఛానల్ కి ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒక అభిమాని ‘మీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు’ అని ప్రశ్నించగా, దానికి రష్మిక సమాధానం చెప్తూ ‘నన్ను అర్థం చేసుకోవడం కాస్త కష్టం. లోతుగా అర్థం చేసుకుంటే కానీ నేను ఎవరికీ అర్థం అవ్వను. కాబట్టి నన్ను లోతుగా అర్థం చేసుకునేవాడు కావలి. ప్రతీ విషయాన్నీ నా వైపు ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోవాలి. కష్ట సమయాల్లో నా కోసం నిలబడి పోరాడాలి. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వాడు దొరికితే అతని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఒకవేళ యుద్ధం వస్తే అతని కోసం తూటాలకు కూడా ఎదురు వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన ఈ లక్షణాలన్నీ చూస్తే విజయ్ దేవరకొండ లో ఇవన్నీ ఉన్నాయేమో అని అంటున్నారు నెటిజెన్స్.
ఇక వీళ్లిద్దరి కెరీర్ విషయానికి వస్తే, రష్మిక ఏమో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ లేడీ సూపర్ స్టార్ గా దూసుకెళ్తోంది. మరోపక్క విజయ్ దేవరకొండ మాత్రం వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో కెరీర్ ని డైలామా లో పాడేసుకున్నాడు. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. ప్రస్తుతం ఆయన శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆశలన్నీ ఈ చిత్రం పైనే. ఇక రష్మిక విషయానికి వస్తే, నిన్ననే ఈమె నుండి ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తోంది.