https://oktelugu.com/

ఎంత చెప్పినా విజయ్ దేవరకొండ వినలేదట !

తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ప్రస్థానం అద్భుతంగా కొనసాగుతుంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా పైకొచ్చిన అతికొద్ది మంది నటులలో విజయ్ ఒకడిగా ఎదిగాడు. సినిమాలలో సహాయ నటుడిగా చిన్న పాత్రలు చేసి తర్వాత హీరోగా మారి అద్భుత విజయాల్ని అందుకొని సూపర్ స్టార్ గా అభిమానులని అలరిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు మూవీలో పక్కింటి కుర్రోడు పాత్రలో నటించి తోలి సినిమాతోనే తోలి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ‘అర్జున్ […]

Written By:
  • admin
  • , Updated On : January 1, 2021 / 10:44 AM IST
    Follow us on


    తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ ప్రస్థానం అద్భుతంగా కొనసాగుతుంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా పైకొచ్చిన అతికొద్ది మంది నటులలో విజయ్ ఒకడిగా ఎదిగాడు. సినిమాలలో సహాయ నటుడిగా చిన్న పాత్రలు చేసి తర్వాత హీరోగా మారి అద్భుత విజయాల్ని అందుకొని సూపర్ స్టార్ గా అభిమానులని అలరిస్తున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు మూవీలో పక్కింటి కుర్రోడు పాత్రలో నటించి తోలి సినిమాతోనే తోలి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించాడు.

    Also Read: ర‌వితేజ సినిమాకి వెంకీ మాట సాయం !

    అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ వెనుక దర్శక నిర్మాతలు వెంటపడి మరీ సినిమాలు చేశారు. “గీత గోవిందం” సినిమాతో వంద కోట్లు మార్క్ ని సైతం అందుకున్నాడు. దాంతో విజయ్ రెమ్యూనరేషన్ కూడా పెంచేసాడు. మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటున్నాడు. హీరోగా కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. తన నిర్మాణ సంస్థ ద్వారా మొదటి సినిమాలో దర్శకుడు తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాని నిర్మించాడు.

    Also Read: టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

    అయితే ఆ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుని ఫైనాన్స్ పరంగా విజయ్ కి నష్టాలని మిగిల్చింది. ఇటీవల తరుణ్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు. ఆ సినిమా గురించి విజయ్ ప్రస్తావించినప్పుడే నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే ఎవరు థియేటర్ కి వచ్చి చూస్తారు, పెట్టిన డబ్బులు కూడా తిరిగి రావు , ఎందుకు ఇంత రిస్క్ చేయటం అని తరుణ్ వారించాడట. అప్పుడు నువ్వు అయితేనే ఆ కథకు సరిపోతావ్ అని , దర్శకుడికి నాకు ఈ కథ మీద నమ్మకం ఉందని చెప్పి నన్ను ఈ సినిమాలో హీరోగా చేయటానికి ఒప్పించాడని ఆయన అన్నారు. చివరికి తాను అనుకున్నట్లుగానే సినిమాకి పెట్టిన మనీ కూడా తిరిగి రాలేదని తరుణ్ చెప్పారు. తరుణ్ మాట వినకుండా ముందడుగు వేసిన విజయ్ కి దారుణమైన ఫలితం ఎదురైందన్న మాట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్