Allu Arjun and Vijay : మన మూవీ లవర్స్ ఎన్నో అద్భుతమైన కాంబినేషన్స్ ని మిస్ అయ్యారు. భవిష్యత్తులో అలాంటి కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు, కానీ అద్భుతమైన కాంబినేషన్ మిస్ అయ్యినప్పుడు మాత్రం, అబ్బా ఎంత మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అని అభిమానులు ఫీల్ అవుతుంటారు. రీసెంట్ గా అలాంటి విషయమే ఒకటి తెలిసింది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో తమిళ హీరో విజయ్(Thalapathy Vijay), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కచ్చితంగా ఉంటారు. అల్లు అర్జున్ ఒకప్పుడు విజయ్ స్థాయి స్టార్ హీరో కాదు కానీ, నేషనల్ వైడ్ గా మంచి పాపులారిటీ ఉన్న హీరోనే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రెడీ అయ్యిందని, కానీ చివరి నిమిషం లో క్యాన్సిల్ అయ్యింది అనే విషయం ఎవరికైనా తెలుసా?..ఈ సంఘటన ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం విడుదలకు రెండేళ్ల ముందు జరిగింది.
Also Read : అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ కొరియోగ్రాఫర్/యాక్టర్/ డైరెక్టర్ ప్రభుదేవా అప్పట్లో అల్లు అర్జున్, విజయ్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టార్రర్ స్టోరీ ని రాసుకున్నాడు. ఈ స్టోరీ ని ముందుగా విజయ్ కి వినిపించాడు. కేవలం ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే అప్పట్లో వినిపించాడట. విజయ్ కి చాలా బాగా నచ్చింది, అల్లు అర్జున్ ని మరో హీరో గా అనుకుంటున్నాను అంటే, చాలా మంచి నిర్ణయం, వెంటనే అతన్ని కలిసి స్టోరీ ని వినిపించండి అని అన్నాడట. ప్రభుదేవా అల్లు అర్జున్ కి కూడా ఫస్ట్ హాఫ్ స్టోరీ నే వినిపించాడు, ఆయనకు కూడా నచ్చింది. కానీ పూర్తి స్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన తర్వాత ప్రభుదేవా మరోసారి ఈ ఇద్దరి హీరోలకు స్టోరీ ని వినిపించాడు. సెకండ్ హాఫ్ హీరోలిద్దరికీ నచ్చలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ అసలు వర్కౌట్ అవధాని ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పారట.
అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ చెయ్యి జారింది. ముఖ్యంగా అల్లు అర్జున్, విజయ్ డ్యాన్స్ అదరగొడుతారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆడియన్స్ కి చూసేందుకు రెండు కళ్ళు సరిపోయేవి కాదు. కానీ ఒకప్పుడు మాత్రం ఇద్దరి హీరోల ఇమేజ్ సమానమైనది కాదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్, విజయ్ కంటే పెద్ద హీరో. ఇప్పుడు మల్టీస్టార్రర్ చిత్రాల ట్రెండ్ మంచి ఊపు మీదున్న నేపథ్యం లో వీళ్ళ కాంబినేషన్ భవిష్యత్తులో అయినా కార్యరూపం దాలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇకపోతే విజయ్ గతం లో మహేష్ బాబు తో కూడా ఒక మల్టీ స్టార్రర్ చిత్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ అప్పట్లో వీళ్లిద్దరి పైనే తీద్దాం అనుకున్నాడు, కానీ అప్పటి బడ్జెట్ లిమిట్స్ సహరించకపోవడం తో ఈ ప్రాజెక్ట్ అట్టకెక్కింది.
Also Read : పవన్ కళ్యాణ్ స్పీచ్ ని రీమేక్ చేసిన విజయ్..వైరల్ అవుతున్న వీడియో!