Puri Jagannadh: తన కలల ప్రాజెక్టు ‘జనగణమన’పై దర్శకుడు పూరీ జగన్నాథ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లైగర్ సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా ‘జనగణమన’ గురించి మాట్లాడారు పూరీ. ‘‘లైగర్ షూటింగ్ పూర్తయింది. ఈరోజుతో జనగణమన’’ అని ఆయన చెప్పిన పాడ్ కాస్ట్ ను ఛార్మి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. సంబంధిత హ్యాష్‌ట్యాగ్ (#JGM) ను జతచేశారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారనే విషయం మీద టాలీవుడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

తన కలల ప్రాజెక్టును షురూ చేయడానికి పూరీ కసరత్తులు చేస్తున్నాడు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించే అవకాశం ఉందని రూమర్లు వినిపించినా అది నిజం కాదు అని తెలుస్తోంది. నిజానికి ఈ కథను పూరి గతంలో మహేష్ బాబుకి చెప్పాడు. మహేష్ కూడా కథ బాగుంది, సినిమా చేద్దాం అంటూ డేట్లు ఇవ్వకుండా సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ లోపు పూరి ప్లాప్ ల వలయంలో చిక్కుకుని మొత్తానికి తన స్టార్ డమ్ ను పోగొట్టుకున్నాడు.
Also Read: సింగరేణి విషయంలో మరోమారు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య యుద్ధమే?
మరోపక్క మహేష్ కోసం ఫామ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఎగబడుతున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఏకంగా రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. కాబట్టి పూరికి మహేష్ ఇప్పట్లో డేట్లు ఇవ్వడం సాధ్యం కాదు. మరోపక్క పూరి కూడా మహేష్ తనకు డేట్లు ఇవ్వడు అని ప్రకటించాడు కూడా. సో.. పూరి జనగణమన లో మరో స్టార్ హీరో నటించడం ఖాయం.

విజయ్ దేవరకొండ హీరోగా, పూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ షూటింగ్ పూర్తయింది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో విజయ్ దేవరకొండ సరికొత్తగా కనిపించనున్నారు. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో తెరకెక్కుతున్న చిత్రమే ‘లైగర్’. ఈ చిత్రంలో ప్రముఖ బాక్సర్ మైక్‌టైసన్ కీలక పాత్ర పోషించారు. ఆగస్టు 25న ‘లైగర్’ ప్రేక్షకుల ముందుకురానుంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లైగర్’
Also Read: సినిమా కంటే ట్విస్టులు.. ఈ లవ్ స్టోరీ ఎండింగ్ అదుర్స్
[…] Also Read: విజయ్ దేవరకొండ కాదు.. మరి ఎవరు ఆ హీరో ? […]