Chiranjeevi Remunaration: మెగా స్టార్ చిరంజీవి కెరీర్ లోనే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ ఓ బ్లాక్ బస్టర్ మూవీ. చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రమిదీ.. అతిలోక సుందరిగా శ్రీదేవి.. జగదేక వీరుడిగా చిరంజీవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పాటలు ఉర్రూత లూగించాయి. ఈ చిత్రంతో చిరంజీవి టాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కారు. 35 ఏళ్లుగా తిరుగులేని స్టార్ గా చిరు వెలుగొందడంలో ఈ చిత్రం కూడా చిరంజీవికి తోడ్పడింది.

చిరంజీవి కెరీర్ లోనే ‘జగదేక వీరుడు -అతిలోకసుందరి’ ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలసాని అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
అప్పటికే బాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా ఉన్న శ్రీదేవిని భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావుతోపాటు జంధ్యాల కూడా స్క్రీన్ ప్లే అందించారు.
ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ 31 సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బుల్లితెరపై ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. జగదేక వీరుడు-అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయిన టైంలో భారీ వర్షాలు కురవడంతో వారం రోజుల పాటు థియేటర్లకు ఎవ్వరూ రాలేదట.. వారం తర్వాత సినిమాకు వచ్చిన టాక్ చూసి జనాలు పోటెత్తారట.. దీంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది.
నెలరోజులు గడిచేసరికి టిక్కెట్లు దొరకడం గగనం అయిపోయింది. అలా 100 రోజులు.. 200 రోజులు.. సంవత్సరం పాటు ఈ సినిమా థియేటర్లలో ఆడింది. ఈ సినిమాలో నటించినందుకు చిరంజీవికి రూ.35 లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చారట.. అప్పట్లో అది చాలా ఎక్కువ అని సమాచారం.
ఇక శ్రీదేవికి కూడా ఏకంగా రూ.25 లక్షలు పారితోషికం ఇచ్చారట.. మూడున్నర దశాబ్ధాల కిందట ఈ రెమ్యూనరేషన్ ఇచ్చారంటే ఇప్పటి లెక్కలు చూస్తే దాని విలువ కోట్లలో ఉంటుంది.
జగన్ ను కలవనున్న సినీ పెద్దలు వీరే..!