Samantha: ఆడవాళ్లు అలా మగవాళ్ళు ఇలా… సమంత భలే ప్లస్ అయ్యిందే!

Samantha: విడాకుల గోల తప్పింది అనుకుంటే ఐటెం సాంగ్ రభస మొదలైంది. సమంత ఏదో విధంగా వార్తల్లో ఉండడం కామనైపోయింది. పుష్ప విషయంలో బన్నీ కంటే కూడా సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అది ఆమె అదృష్టమనాలో దురదృష్టమనాలో తెలియదు కానీ.. పుష్ప కారణంగా సమంత అందరి నోళ్ళలో నానుతుంది. దాదాపు మూడు నెలల పాటు సమంత విడాకులు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది. విడాకులకు కారణాలు ఇవేనంటూ పలు పుకార్లు తెరపైకి రావడం […]

Written By: Shiva, Updated On : December 16, 2021 10:49 am
Follow us on

Samantha: విడాకుల గోల తప్పింది అనుకుంటే ఐటెం సాంగ్ రభస మొదలైంది. సమంత ఏదో విధంగా వార్తల్లో ఉండడం కామనైపోయింది. పుష్ప విషయంలో బన్నీ కంటే కూడా సమంత పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అది ఆమె అదృష్టమనాలో దురదృష్టమనాలో తెలియదు కానీ.. పుష్ప కారణంగా సమంత అందరి నోళ్ళలో నానుతుంది.

Samantha

దాదాపు మూడు నెలల పాటు సమంత విడాకులు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా నడిచింది. విడాకులకు కారణాలు ఇవేనంటూ పలు పుకార్లు తెరపైకి రావడం జరిగింది. ఈ విషయంలో జనాలు, మీడియా సమంతను కార్నర్ చేశారు. ఆమె ప్రవర్తన కారణంగానే చైతూ విడాకుల నిర్ణయం తీసుకున్నారని ఏకపక్షంగా మాట్లాడారు. తన పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో ఆమెకు అఫైర్ కూడా అంటగట్టారు. సమంత విడాకుల ఎపిసోడ్ పై వందల కొద్ది కథనాలు రాగా.. చదివి చదివి జనాలకు విసుగొచ్చేసింది. దీంతో మీడియా కూడా ఫోకస్ తగ్గించేసింది.

ఆ వివాదం అలా సద్దుమణిగిందో లేదో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పదేళ్ల కెరీర్ లో ఫస్ట్ టైమ్ సమంత ఐటెం సాంగ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప లో ఆమె ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా’ సాంగ్ లో బోల్డ్ స్టెప్స్ తో రెచ్చిపోయారు. పాటలోని లిరిక్స్ నాటుగా, ఘాటుగా ఉన్నాయి. స్కిన్ షో విషయంలో హద్దులు దాటిన సమంత తీరు మైండ్ బ్లాక్ చేస్తుంది.

ఈ సాంగ్ కారణంగా సమంత ఓ వర్గం నుండి విమర్శలు, మరో వర్గం నుండి ప్రసంశలు ఎదుర్కొంటుంది. మగవాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పాటలో లిరిక్స్ ఉన్నాయని పుష్ప ఐటెం సాంగ్ పై కేసు నమోదు కావడం జరిగింది. మగవాళ్ళను కామాంధులుగా, స్త్రీలోలుగా, ఆడవాళ్లను తప్పుడు దృష్టితో చూసేవారిగా ఈ సాంగ్ లో చిత్రీకరించారని మగవారు ఆరోపిస్తున్నారు.

Also Read: Movie Ticket Rates: టికెట్ రేట్ల‌పై నేడే విచార‌ణ‌.. జ‌గ‌న్ స‌ర్కార్ పంతం నెగ్గుతుందా..?

సమంత సాంగ్ పై మగాళ్ల వర్షన్ ఇలా ఉంటే.. ఆడవాళ్ళ ఆలోచన మరోలా ఉంది. మగాళ్ల పాడు బుద్ది ఈ పాట ద్వారా బయటపెట్టారని మహిళలు సమంతను ప్రశంసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో సమంతకు, లిరిసిస్ట్ చంద్రబోస్ కి పాలాభిషేకం కూడా చేశారు. సమాజంలో స్త్రీల పట్ల మగవారి చెడు దృష్టిని చక్కగా వర్ణించి, ఓ సామాజిక సమస్య తెరపైకి తెచ్చారనేది సదరు మహిళల అభిప్రాయం. ఏదో ఐటెం నంబర్ కోసం రాసిన ఈ సాంగ్ ఇంత రాద్ధాంతం చేస్తుందని రచించిన చంద్రబోస్ తో పాటు సమంత, సుకుమార్, బన్నీ కూడా ఊహించి ఉండరు. ఏది ఏమైనా వివాదం కారణంగా పుష్ప మూవీకి ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుంది.

Also Read: Trivikram Wife: శిల్పకళావేదికపై త్రివిక్రమ్ భార్య నృత్యప్రదర్శన.. ముఖ్య అతిథిగా పవర్​స్టార్​

Tags