Vijay Devarakonda: ఆ ఆంటీ తో అలా వెళ్లిన విజయ్ దేవరకొండ.. వైరల్ పిక్

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే ఓ సినిమాని నిర్మిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 13, 2024 10:45 am

Vijaya Devarakonda Viral Pic

Follow us on

Vijay Devarakonda: సినిమాలో హీరోలు బైక్ పై రయ్యిమంటూ దూసుకెళ్తారు. వెనకాల హీరోయిన్ ను కూర్చోబెట్టుకొని డ్యూయెట్లు పాడుతుంటారు. అంతేకాదు బైక్ పై సూపర్ మాన్ లాంటి స్టంట్ లు చేస్తుంటారు. విలన్లను ఏకకాలంలో మట్టి కరిపిస్తుంటారు. అయితే అలాంటి స్టంట్లు నిజం కావని అందరికీ తెలుసు. కాకపోతే హీరోలను సూపర్ మాన్ రేంజ్ లో చూపించడానికి దర్శకులు అన్ని రకాలుగా తిప్పలు పడుతుంటారు. అయితే ఇక్కడ ప్రాథమిక సూత్రం ఒకటి ఉంటుంది.. స్టంట్ లు, మిగతావేవీ చేయరాక పోయినప్పటికీ కనీసం బైక్ నడపడం వచ్చి ఉండాలి. ఒకవేళ హీరో కు బైక్ నడపడం రాకపోతే మరో విధమైన ఏర్పాట్లు చేస్తారు. టాలీవుడ్ లో హీరో కు ఓ చిత్ర నిర్మాణ సంస్థ అలాంటి ఏర్పాట్లే చేసింది. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, పరశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్(Family Star) అనే ఓ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. నందలాల అనే పాట కూడా రిలీజ్ అయింది. టీజర్, పాట మిలియన్ వ్యూస్ నమోదు చేశాయి. టీజర్ ప్రామిసింగ్ గా ఉండటంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఖుషి సినిమా కూడా హిట్ కావడంతో ఈ సినిమాకు మంచి మార్కెటింగ్ జరిగిందని చిత్ర యూనిట్ చెప్తోంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని షూటింగ్ స్టిల్స్ బయటకు వచ్చాయి. అందులో ఒక సన్నివేశంలో విజయ్ దేవరకొండ బైక్ పై ఓ ఆంటీని కూర్చోబెట్టుకొని వెళ్తున్నాడు. అయితే ఆ బైక్ కింద రెండు చక్రాలు ఏర్పాటు చేయడం విశేషం. సహజంగా ఇలాంటి చక్రాలు డ్రైవింగ్ రాని వారి కోసం ఏర్పాటు చేస్తారు. విజయ్ దేవరకొండ ను చూస్తే అలా అనిపించదు. పైగా గీతా గోవిందం సినిమాలో రష్మికను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై కూర్చోబెట్టి తిప్పుతుంటాడు. మరి అలాంటి విజయ్ కి బైక్ డ్రైవింగ్ రాదని ఎలా అనుకుంటాం.. అయితే తాజాగా విడుదలైన సినిమా స్టిల్ చూస్తే బైక్ కింద రెండు చక్రాలు ఏర్పాటు చేయడం విశేషం.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. “ఇన్నాళ్ళూ బైక్ డ్రైవింగ్ రాలేదని బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. కింద చక్రాలు ఉన్నాయి.. విజయ్ లాంటి వాడే అలా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మనం ఎంత.. దూసుకుపోవడమే” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సినిమాల్లో ఇలాంటివి సాధారణమైనని, సన్నివేశాల తీరును బట్టి బైకులు వాడుతుంటారని.. అంతమాత్రాన హీరోకు బైక్ డ్రైవింగ్ రాదని తేల్చేయడం సరికాదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ విజయ్ దేవరకొండ బరువు ఆపలేక బ్యాలెన్స్ చేయలేక ఇలా కింద పడకుండా ఇలా పెట్టుకున్నాడని.. విజయ్ కు బైక్ నడపడం రాదా? అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.