Puspaka Vimanam: దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. మిడిల్ క్లాస్ మెలోడీస్‌తో సూపర్ హిట్ అందుకున్నారు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. తాజాగా, పుష్పక విమానం సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది చిత్రబృందం. ఇందుకు ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ వచ్చారు. దర్శకుడు దామోదర రూపొందించిన చిత్రం ఇది. గీత్ సైని, శాన్వి మేఘన కథానాయికలుగా ఈ సినిమాలో కనిపంచనున్నారు. ఈ సినిమా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను లైగ్ షూటింగ్ కోసం యూఎస్ వెళ్తుండటం వల్ల.. సినిమా విడుదల సమయంలో ఇక్కడ ఉండటం లేదని అన్నారు. ఈ సినిమాను మీరే దగ్గరుండి చూసుకుని.. విజయవంతం చేయాలని ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. కెరీర్ ప్రారంభంలో తాను పడిన కష్టం.. ఇంకొకరు పడకూడదనే ఉద్దేశంతోనే కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టంగా ఉందని.. ఒక్కోసారి ఇదంటా మనసు అవసరమా అనిపిస్తుంటుందని అన్నారు. కానీ, అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నట్లు విజయ్ తెలిారు. కాగా, సినిమా దర్శకుడు దామోదర తనకు ఎప్పటి నుంచో పరిచయమని అన్నారు. తనలో మంచి రచయిత ఉన్నారని అన్నారు. మరోవైపు, నవంబరు 12న విడుదలవుతున్న కార్తికేయ రాజా విక్రమార్క సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు విజయ్ తెలిపారు.