https://oktelugu.com/

మహేష్ సినిమా పై విజయ్ దేవరకొండ కామెంట్స్ !

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ విజయాన్నే నమోదు చేసి ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ ఓ సినిమా చేస్తోన్నాడు. కాగా తాజాగా విజయ్ దేవరకొండ పూరి గురించి, ఫైటర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ‘పూరిగారు అంటే నాకు ఎంతో ఇష్టం, ముఖ్యంగా ఆయన మహేష్ బాబుతో చేసిన “పోకిరి” సినిమా నా ఫేవరెట్ మూవీ అని […]

Written By:
  • admin
  • , Updated On : October 10, 2020 / 12:46 PM IST
    Follow us on


    డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాల కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ విజయాన్నే నమోదు చేసి ప్రస్తుతం తన తరువాత సినిమాని సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ ఓ సినిమా చేస్తోన్నాడు. కాగా తాజాగా విజయ్ దేవరకొండ పూరి గురించి, ఫైటర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ‘పూరిగారు అంటే నాకు ఎంతో ఇష్టం, ముఖ్యంగా ఆయన మహేష్ బాబుతో చేసిన “పోకిరి” సినిమా నా ఫేవరెట్ మూవీ అని విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ ఫైటర్ సినిమా గురించి కూడా చెబుతూ.. ‘నేను ఎప్పుడు ఇలాంటి కమర్షియల్ సినిమా చెయ్యలేదు, అందుకే ఫైటర్ చిత్రం నాకు చాలా స్పెషల్.. ఒక విధంగా ఇలాంటి సినిమా కోసమే నేను ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను. అందుకే ఈ సినిమాలో రోల్ కోసం ఎనిమిది నెలల నుంచి వర్కౌట్స్ చేస్తున్నాను. ఈ సినిమాలో సిక్స్ పాక్స్ లేదా ఎయిట్ పాక్స్ లో కనిపిస్తాను అంటూ విజయ్ తెలిపాడు.

    Also Read: బిగ్ బాస్: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అవినాష్‌ ఎమోషన్‌

    కాగా లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం మొదలుపెట్టిన వర్కౌట్స్ ను ఇంకా కంటిన్యూ చేస్తుండటం నిజంగా విశేషమే. ఏమైనా విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈ సినిమా కోసం బాగా కష్ట పడుతున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని.. అయితే విజయ్ దేవరకొండ డాన్ కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. ఆ తరువత చాల భాగం డాన్ కి వ్యతిరేకంగా పని చేస్తుంటాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యారు.