https://oktelugu.com/

Thalapathy 66: విజయ్ ఫ్యాన్స్ కి భారీ సర్పైజ్… తలపతి 66 నుండి ఫస్ట్ లుక్!

Thalapathy 66: కోలీవుడ్ స్టార్ విజయ్ బర్త్ డే వేడుకలు షురూ అయ్యాయి. జూన్ 22న విజయ్ 48వ బర్త్ డే ఘనంగా జరుపుకోనున్నారు. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఎలాంటి వేడుకలు జరగలేదు. బహిరంగ ప్రదేశాల్లో సామూహిక వేడుకలు ప్రభుత్వాలు నిషేధించాయి. అదే సమయంలో హీరోలు స్వయంగా తమ బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దంటూ ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ సద్దుమణిగాక […]

Written By: , Updated On : June 19, 2022 / 05:19 PM IST
Follow us on

Thalapathy 66: కోలీవుడ్ స్టార్ విజయ్ బర్త్ డే వేడుకలు షురూ అయ్యాయి. జూన్ 22న విజయ్ 48వ బర్త్ డే ఘనంగా జరుపుకోనున్నారు. గత రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో ఎలాంటి వేడుకలు జరగలేదు. బహిరంగ ప్రదేశాల్లో సామూహిక వేడుకలు ప్రభుత్వాలు నిషేధించాయి. అదే సమయంలో హీరోలు స్వయంగా తమ బర్త్ డే వేడుకలు నిర్వహించవద్దంటూ ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనా వైరస్ సద్దుమణిగాక వచ్చిన విజయ్ ఫస్ట్ బర్త్ డే ఇది. దీంతో భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు, వేడుకలు ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Thalapathy 66

vijay

అదే సమయంలో ఫ్యాన్స్ కి విజయ్ నుండి అనుకోని సర్ప్రైజ్ దక్కింది. విజయ్ లేటెస్ట్ మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లితో విజయ్ తన 66వ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తలపతి 66 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఆయన బర్త్ డే కానుకగా జూన్ 21న సాయంత్రం 6:01 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సడన్ సర్పైజ్ అప్డేట్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. విజయ్ 66వ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Prakash Raj About Sai Pallavi: దుమ్మురేపుతున్న సాయిపల్లవి వ్యాఖ్యలు.. ఆమెకు మద్దతుగా ప్రకాశ్ రాజ్

కాగా చాలా కాలం క్రితమే దర్శకుడు వంశీ పైడిపల్లితో విజయ్ తలపతి 66 ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలు కాగా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. తలపతి 66 మూవీ హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తున్నారు. విజయ్ తో ఆమెకు ఇదే మొదటి చిత్రం. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మహర్షి మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి విజయ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా విజయ్ నెక్స్ట్ విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ తో మూవీ చేస్తున్నారు. వరుసగా ఆయన నుండి క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. విజయ్ గత చిత్రాలు బిగిల్, మాస్టర్ భారీ విజయాలు నమోదు చేశాయి. బీస్ట్ మాత్రం నిరాశపరిచింది.

Thalapathy 66

Vijay

భారీ అంచనాల మధ్య విడుదలైన బీస్ట్ నిరాశపరిచింది. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. పూర్తి నెగిటివ్ టాక్ తో కూడా బీస్ట్ తమిళనాడు చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక వంశీ పైడిపల్లి మూవీతో విజయ్ కమ్ బ్యాక్ కావాలని కోరుకుంటున్నారు.

Also Read:Actress Indraja- Roja: రోజా వస్తే సీటు వదిలేస్తా.. వైరల్ అవుతున్న ఇంద్రజ కామెంట్లు

Thalapathy Vijay Birthday Special Video || Thalapathy 66 || Vijay Birthday Mashup Updates

Tags