Prakash Raj About Sai Pallavi: నటి సాయిపల్లవి తన వ్యాఖ్యలతో వివాదాల్లో ఇరుక్కుంది. కశ్మీరీ హత్యలపై స్పందించి ఆమె చేసిన కామెంట్లపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. దేశంలో అన్ని మతాలు సమానత్వమే అని చెబుతోంది. అందరికి జీవించే హక్కు ఉందని వ్యాఖ్యానిస్తోంది. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతోంది. దీనిపై భజరంగ్ దళ్ కార్యకర్తలు మండిపడుతున్నారు. సాయిపల్లవి సరదాగా సినిమాలు చేసుకోకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేనిపోని విషయాలపై ఆమె ఎందుకు తలదూర్చడం అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఆమె వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ మద్దతు పలికారు. సాయిపల్లవి వెంట నునున్నానని దీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అందరికి మాట్లాడే హక్కు ఉందని చెబుతున్నారు. సాయిపల్లవి మాట్లాడిన దాంట్లో తప్పు ఏముందని అడుగుతున్నారు. కశ్మీర్ లో జరుగుతున్న దమనకాండపై ప్రశ్నించే గొంతు అందరికి ఉందని పేర్కొంటున్నారు. సాయిపల్లవి వ్యాఖ్యల్లో తప్పు లేదని ఆమెకు మా మద్దతు ఉందని వ్యాఖ్యానించారు.
Also Read: Actress Indraja- Roja: రోజా వస్తే సీటు వదిలేస్తా.. వైరల్ అవుతున్న ఇంద్రజ కామెంట్లు
దీంతో సాయిపల్లవి వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారుతోంది. కశ్మీర్ లో హత్యల గురించి తీసిన సినిమా కశ్మీర్ ఫైల్స్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో గోహత్యల పేరుతో కొందరిని దారుణంగా హతమార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో విషయం కాస్త వివాదంగా మారింది. ఇందులో సాయిపల్లవి జోక్యంపై పలువురు ఖండిస్తున్నారు. ఆమె నటిగానే గుర్తింపు తెచ్చుకోవాలని రాజకీయాల ద్వారా కాదని హితవు పలుకుతున్నారు.
మొత్తానికి విషయం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. సినిమా పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రశాంతంగా ఉన్న పరిశ్రమలో వివాదాల వర్షం కురిపిస్తోంది. ఆమె చేసిన వ్యాఖ్యలతో సినిమా పరిశ్రమే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయంలో ఇప్పటికే దుమారం రేగుతుండగా దీనికి ప్రకాశ్ రాజ్ ఆజ్యం పోసి గ్రూపులుగా చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాయిపల్లవి మాటలు తూటాల్లా పేలుతున్నాయనడంలో సందేహం లేదు.
Also Read:Successors in Film Industry: సినిమా పరిశ్రమలో వారసులదే హవా