https://oktelugu.com/

Vijay Antony: పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా..నేను పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని : విజయ్ ఆంటోనీ

టాలీవుడ్ లో బాగా ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ అడిగితే దానికి సమాధానం చెప్తూ 'నేను టాలీవుడ్ లో అందరి హీరోల సినిమాలు చూస్తాను, కానీ నాకు వ్యక్తిగతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఆయన తర్వాతే నాకు ఎవరైనా' అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ.

Written By:
  • Vicky
  • , Updated On : May 18, 2023 / 08:09 AM IST

    Vijay Antony

    Follow us on

    Vijay Antony: మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరో గా మారి విభిన్నమైన సినిమాలు చేస్తూ తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన హీరో గా నటించిన బిచ్చగాడు చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఇక ఆయన లేటెస్ట్ గా నటించిన ‘బిచ్చగాడు 2 ‘ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదల కాబోతుంది.

    ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం విజయ్ ఆంటోనీ రీసెంట్ గా తెలుగు లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన బిచ్చగాడు 2 చిత్రానికి సంబంధించిన విశేషాలు మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత విషయాలు, అలాగే తనకి టాలీవుడ్ లో ఇష్టమైన హీరోలు మరియు సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.

    మీకు టాలీవుడ్ లో బాగా ఇష్టమైన హీరో ఎవరు అని యాంకర్ అడిగితే దానికి సమాధానం చెప్తూ ‘నేను టాలీవుడ్ లో అందరి హీరోల సినిమాలు చూస్తాను, కానీ నాకు వ్యక్తిగతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఆయన తర్వాతే నాకు ఎవరైనా’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ.

    ఇంకా ‘బిచ్చగాడు 2’ గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమాకి బిచ్చగాడు సినిమాకి ఎలాంటి సంబంధం లేదు, ఈ చిత్రం మొత్తం కేవలం డబ్బు మరియు సైన్స్ చుట్టూ తిరుగుతుంది. ఎమోషన్స్ కూడా బాగా పండాయి’ అని చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ. మరి బిచ్చగాడు సినిమాతో ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు ‘బిచ్చగాడు 2 ‘ అని టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోండి అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ ఆంటోనీ.