https://oktelugu.com/

Siddharth- Samantha: హీరో సిద్దార్థ్ తో రొమాన్స్ చెయ్యబోతున్న సమంత.. డైరెక్టర్ ఎవరో తెలుసా!

డీజీ టిల్లు వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : May 18, 2023 / 08:03 AM IST

    Siddharth- Samantha

    Follow us on

    Siddharth- Samantha: సౌత్ ఇండియన్ టాప్ మోస్ట్ హీరోయిన్ సమంత ఇప్పుడు లేటెస్ట్ గా ఎంచుకుంటున్న కథలు ఎంతో ప్రయోగాత్మకంగా ఉంటున్నాయి. ఆమె చేస్తున్న పాత్రలు కూడా రెగ్యులర్ హీరోయిన్ కి బిన్నంగా ఉంటున్నాయి. కథలో సత్తా ఉంటే విలన్ రోల్స్ చెయ్యడానికి కూడా ఆమె ఏమాత్రం వెనకడుగు వెయ్యలేదు. గతం లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ చేసి పాన్ ఇండియన్ ఆడియన్స్ దృష్టిలో పడింది.

    ఇప్పుడు ఆ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ & డీకే తోనే ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇందులో ఆమె రా ఏజెంట్ గా కనిపించబోతుంది. ఈ సిరీస్ కాకుండా ఆమె విజయ్ దేవరకొండ తో ఖుషి అనే చిత్రం లో నటిస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో లో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 1 వ తారీఖున విడుదల కాబోతుంది.

    ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ యంగ్ హీరో సిద్దార్థ్ జొన్నలగ్గడ్డ అలియాస్ సిద్దు జొన్నలగడ్డ హీరో గా నందిని రెడ్డి దర్శకత్వం లో ఒక సినిమా త్వరలోనే తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో సిద్దు కి జోడిగా సమంత నటించబోతుందట.

    డీజీ టిల్లు వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ, ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే వయస్సు లో సిద్దు కంటే పెద్దది అయిన సమంత అతనితో జోడి కడితే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.