Hatya Movie Review: నటీనటులు: విజయ అంటోనీ , మీనాక్షి చౌదరి, రితికా సింగ్ , రాధికా శరత్ కుమార్ , మురళీ శర్మ
దర్శకత్వం: బాలాజీ కె కుమార్
నిర్మాత: ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్
సినిమాటోగ్రఫి: శివ కుమార్ విజయన్
ఎడిటింగ్: సెల్వా ఆర్కే
మ్యూజిక్: గిరీష్ గోపాలకృష్ణన్
విభిన్నమైన ఆలోచనలు ఉన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరో విజయ్ ఆంటోనీ. ఆయన ప్రతీ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. సినిమా కమర్షియల్ గా హిట్ అయినా , ఫ్లాప్ అయినా ఒక కొత్త ప్రయత్నం చేసాడు అనే పేరు మాత్రం ఉంటుంది ఆయనకీ. అందుకే ఆయన సినిమాలకు తెలుగు మంచి క్రేజ్ ఉంటాది. బిచ్చగాడు సినిమా తో తెలుగు లో మార్కెట్ ని ఏర్పర్చుకున్న విజయ్ ఆంటోనీ , మల్లి దాని సీక్వెల్ బిచ్చగాడు 2 తో బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘హత్య’ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లెర్ గా తెరకెక్కిన ఈ సినిమా నిన్న గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
లైలా(మీనాక్షి చౌదరి) అనే అమ్మాయి ఒక పాపులర్ ఫ్యాషన్ మోడల్. హైదరాబాద్ లో ఆమె ఉంటున్న ఫ్లాట్ లోనే అనుమానాస్పద స్థితి లో హత్య కి గురి అవుతుంది. పోస్ట్ మార్టం రిపోర్టు లో ఆమెని ఎవరో ఊపిరి ఆడనివ్వకుండా చంపేశారు అని వస్తుంది. ఈ కేసు ని టేకప్ చెయ్యడానికి ఐపీఎస్ అధికారిని సంధ్య(రితికా సింగ్) వస్తుంది. ఆమెకి ఈ కేసు లో క్లూలు దొరకక పోవడంతో డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోనీ) సహాయం తీసుకోవాలని అంటుకుంటుంది. మొదట్లో ఆయన సహాయం చెయ్యడానికి నిరాకరిస్తాడు. కానీ కేసు ఆసక్తికరంగా ఉండడం తో స్వయంగా ఆయనే కేసు మొత్తం టేకప్ చేస్తాడు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయం లో మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్(మురళి శర్మ), ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్ అర్జున్ వాసుదేవ్(అర్జున్ చిదంబరం), బబ్లూ (కిషన్ కుమార్) మరియు మరో వ్యక్తి కి ఇలా నలుగురిని అనుమానాస్పదులు గా గుర్తిస్తారు. మరి వీరిలో ఎవరు లైలా ని హత్య చేసారు అనేదే స్టోరీ.
విశ్లేషణ :
ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ జానర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. సరిగ్గా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ సృష్టిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సాగుతూనే మధ్యలో వచ్చే ట్విస్టులు, మరియు ఇతర సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తుంటాయి. అలాంటి జానర్ తో విజయ్ ఆంటోనీ లాంటి హీరో సినిమా చేస్తే కచ్చితంగా ఆడియన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేక పోయింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మటు లో నత్త నడకన సినిమా సాగిపోతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో తర్వాత ఏమి జరుగుతుందా అనే ఫీలింగ్ కలిగించాలి. కానీ ఈ సినిమాలో అలాంటివేమీ ఉండవు. దీనికి తోడుకథకి హీరో కూతురు కి లింక్ ఉన్నట్టు చూపిస్తారు. ఆ సన్నివేశాలు సినిమాకి స్పీడ్ బ్రేకర్స్ లాగా మారాయి కానీ,సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు.
కానీ నలుగురు నిందితులను అనుమానించే సన్నివేశాలు మాత్త్రం డైరెక్టర్ బాగా రాసుకున్నాడు. కానీ మనకి సెకండ్ హాఫ్ మధ్యలోనే హంతకుడు ఎవరూ అనే విషయం అర్థం అయ్యిపోతాది. క్లైమాక్స్ బాగుంటుంది కానీ సూపర్ అనిపించే రేంజ్ లో ఉండదు. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో విజయ్ ఆంటోనీ కథకి తగ్గట్టుగా సీరియస్ గా ఇందులో నటించాడు. ఇక ఈ సినిమాని మీనాక్షి చౌదరి ఎందుకు ఒప్పుకుందో తెలియదు. మంచి లీడింగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె, నటనకి ఏమాత్రం ప్రాధాన్యత లేని ఇలాంటి పాత్రని ఒప్పుకొని ఆమె తన టైం ని వృధా చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇక రితికా సింగ్ తన పాత్ర పరిధికి తగ్గట్టుగా చక్కగా నటించింది. రాధికా శరత్ కుమార్ పాత్ర ఎందుకు ఉందో, చివరికి ఆమె ఏమైందో ఎవరికీ అర్థం కాదు. అలాంటి స్క్రీన్ ప్లే తో నడిపించాడు డైరెక్టర్ బాలాజీ ఈ సినిమాని.
చివరి మాట :
ఎదో వేరే లెవెల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది అని థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ మాత్రం బాగా నిరాశ చెందుతారు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం సంతృప్తి చెందుతారు.
రేటింగ్ : 2.5/5