https://oktelugu.com/

Bichagadu 2 Movie Trailer: ‘బిచ్చగాడు 2’ ట్రైలర్ అదిరిపోయింది..మరోసారి బాక్స్ ఆఫీస్ బద్దలుకావాల్సిందేనా!

సీక్వెల్ మే 19 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం, ఇందులో విజయ్ ఆంటోనీ వేల కోట్ల రూపాయిల ఆస్తికి అధిపతిగా కనిపించాడు, కొన్ని సన్నివేశాల్లో యాంటీ బికిలీ అనే పేరుతో రాబిన్ హుడ్ లాగ కనిపించాడు, అయితే మొదటి భాగం లో లాగ ఇందులో హీరో బిచ్చమ్ ఎత్తుకోవడం వంటివి చెయ్యడం చూపించలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : April 29, 2023 / 01:24 PM IST
    Follow us on

    Bichagadu 2 Movie Trailer: మన టాలీవుడ్ లో ఎన్నో డబ్బింగ్ సినిమాలు గుట్టు చప్పుడు కాకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించినవి ఎన్నో ఉన్నాయి, అలాంటి సినిమాలలో ఒకటి ‘బిచ్చగాడు’. ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరో గా మారి తమిళం చేసిన ‘పిచైకరణ్’ అనే చిత్రం అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ చిత్రాన్ని తెలుగు డబ్ చేసి విడుదల చేసారు, ఇక్కడ ఎవ్వరూ ఊహించని రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది.

    అప్పట్లోనే ఈ సినిమా తెలుగు లో 15 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది, తమిళం 9 కోట్ల షేర్ ని వసూలు చేసింది.మొత్తం మీద రెండు భాషలకు కలిపి 24 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.అలాంటి చిత్రానికి చాలా కాలం తర్వాత సీక్వెల్ రాబోతుంది.

    ఈ సీక్వెల్ మే 19 వ తేదీన తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం, ఇందులో విజయ్ ఆంటోనీ వేల కోట్ల రూపాయిల ఆస్తికి అధిపతిగా కనిపించాడు, కొన్ని సన్నివేశాల్లో యాంటీ బికిలీ అనే పేరుతో రాబిన్ హుడ్ లాగ కనిపించాడు, అయితే మొదటి భాగం లో లాగ ఇందులో హీరో బిచ్చమ్ ఎత్తుకోవడం వంటివి చెయ్యడం చూపించలేదు.

    ప్రారంభం నుండే హీరో ని అపరకుభేరుడిగా చూపించారు, మరి బిచ్చగాడు 2 అనే టైటిల్ ని ఎందుకు పెట్టారు?, ఈ సినిమా బిచ్చగాడు చిత్రానికి కొనసాగింపుగా ఉంటుందా, లేదా పూర్తిగా కొత్త సినిమానా అనేది ట్రైలర్ లో అర్థం కాలేదు. కానీ ఈ చిత్రానికి ఓపెనింగ్స్ మాత్రం చాలా బలంగా ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. బిచ్చగాడు సినిమాకి ఫ్యామిలి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందని, కచ్చితంగా ఈ చిత్రం కమర్షియల్ గా దుమ్ములేపేస్తుందని అంటున్నారు, చూడాలి మరి.