https://oktelugu.com/

Madhavan: క్రేజీ సినిమాలో మాజీ రొమాంటిక్ హీరో

Madhavan: విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందని, పైగా నయనతారనే నిర్మాత అని తెలిసి.. ఇక ఈ సినిమా హిట్ గ్యారంటీ అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో మాజీ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ పాత్ర వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందట. మొత్తానికి సమంత మూవీలో మాధవన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 24, 2022 / 12:11 PM IST
    Follow us on

    Madhavan: విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందని, పైగా నయనతారనే నిర్మాత అని తెలిసి.. ఇక ఈ సినిమా హిట్ గ్యారంటీ అనుకున్నారు అందరూ. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో మాజీ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

    madhavan

    కాగా ఈ పాత్ర వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందట. మొత్తానికి సమంత మూవీలో మాధవన్ అంటూ ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. ఇక అక్కినేని సమంత వరుస సినిమాలు చేస్తోంది, ఎక్కడా గ్యాప్ లేకుండా వరుసగా షూటింగ్ లో పాల్గొంటుంది. పైగా సామ్ చేసే ప్రతి సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కారణం.. సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ ముందుకు పోతుంది సమంత.

    Also Read:  ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరంభం.. బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్పాట్ లు ఇక భస్మీపటలమేనా?

    Kaathuvaakula_Rendu_Kaadhal movie

    అయితే.. అన్నీ సినిమలో కల్లా నయనతార – విజయ్ సేతుపతి – సమంత కలయికలో వస్తున్న సినిమా పైనే భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ, ఈ సినిమా అనౌన్స్ చేసిన తరువాత సడెన్ గా కరోనా రావడం, అంతలో లాక్ డౌన్ ను పెట్టడం దాంతో ఈ సినిమా ఈ ఏడాదికి పోస్ట్ ఫోన్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఈ జనవరిలో హైదరాబాద్ లో

    ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. దాదాపు నెల రోజులు పాటు షూట్ చేశారు. మొత్తానికి సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. త్వరలోనే సినిమాను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. విజయ్ సేతుపతి హీరో, సమంత నయనతార హీరోయిన్లు.. నిజంగా క్రేజీ కాంబినేషన్ అంటే ఇదే.

    Also Read: పవన్ సినిమా సెట్స్ కోసం 10 కోట్లు

    Tags