Murder Case in Bengaluru: వారు ముగ్గురూ స్నేహితులు. ఒకే ప్రాంతంలో పెరిగారు. ఒక్కచోటే చదువుకున్నారు. దీంతో వారి మధ్య సఖ్యత చాలా కుదిరింది. రోజూ సాయంత్రం కలుసుకుని మందు తాగి కబుర్లు చెప్పుకుని ఒకరి కష్టాలు మరొకరు పంచుకునేవారు. ఇలా సాగుతున్న వారి స్నేహంలో ఒక్కసారిగా కలతలు వచ్చాయి. స్నేహితిడిని చులకనగా మాట్లాడటంతో జీర్ణించుకోలేని అతడు వారిపై కక్ష పెంచుకున్నాడు ఎలాగైనా అతడిని ఖతం చేయాలని భావించాడు దీనికి గాను పక్కా ప్రణాళిక రచించాడు.

బెంగుళూరులోని డీజేహళ్లి ప్రాంతంలోని ఏకే కాలనీలో నివాసముండే ప్రవీణ్ అలియాస్ పుణే, సురేష్, శ్యామ్యుయేల్ స్నేహితులు. చిన్నతనం నుంచి కలిసి పెరిగారు. ఎవరి ఉద్యోగాల్లో వారు బిజీగా మారిపోయారు. నిత్యం సాయంత్రం కలుసుకుని మద్యం తాగుతూ ఎంజాయ్ చేసేవారు. ఒకరి కష్టాలు మరొకరు చెప్పుకుంటూ రాత్రంతా సరదాగా గడిపేవారు.
Also Read: ఏపీ బీజేపీ నేతల మాటలకు విలువ లేదా?
ఈ క్రమంలో రోజులాగే సాయంత్రం వారు మందు తాగుతూ కూర్చుకున్నారు. దీంతో వీరి మధ్య సంభాషణలు తీవ్ర స్థాయికి చేరాయి. ప్రవీణ్ ఓ హిజ్రాతో చనువుగా ఉంటున్నాడని హేళనగా మాట్లాడారు. దీంతో వారి మధ్య విభేదాలు పెరిగాయి. గొడవ జరిగింది. ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. దీంతో వారి మద్య దూరం పెరిగింది.

స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోయారు. దీంతో ప్రవీణ్ తనను హేళన చేసిన వారిని అంతమొందించాలని భావించాడు. తనకు సహాయంగా తనస్నేహితులను తీసుకొచ్చాడు. బస్టాప్ లో ఫోన్ లో మాట్లాడుతున్న శ్యామ్యుయేల్ పై కత్తితో దాడికి తెగబడ్డారు. దీంతో స్థానికులు గుమిగూడటంతో అక్కడి నుంచి పరారయ్యారు. శ్యామ్యుయేల్ ఫిర్యాదు మేరకు సురేష్, అతడి స్నేహితులపై కేసు నమోదు చేశారు పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. హిజ్రాతో ఉన్న సంబంధం వల్లే స్నేహితుల మధ్య పొరపొచ్చాలు రగిలినట్లు తెలుస్తోంది.
Also Read: గల్లీలో అధికారం కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారా?