OK Telugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలయ్య బాబుతో మరో సినిమా తీయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే పరుశురాం కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న పరుశురామ్.. గతంలో బాలయ్యకు చెప్పిన కథను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య బాబుతో సినిమా ఉంటుందట. ఆ తర్వాత కృష్ సినిమా ఉంటుందట.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ‘రావణాసుర’ మూవీ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఫైట్ సీక్వెన్స్ లు షూట్ చేస్తున్నారు. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో.. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.
Also Read: ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్: పవన్ కు షాక్.. టీఆర్ఎస్ సర్కార్ ప్రమోషన్ కు వాడుకుందా?

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. భారీ పాన్ ఇండియా మూవీ RRR ప్రమోషన్లను మార్చి తొలి వారం నుంచి షురూ చేయాలని రాజమౌళి టీం భావిస్తోంది. దుబాయ్‌లో ఈవెంట్ నిర్వహించాలని యోచిస్తోందట. దీనికి ఓ హాలీవుడ్ స్టార్ హాజరు అవుతారని వార్తలు వస్తున్నాయి. మార్చి 15న ఈ ఈవెంట్ జరగబోతోందని టాక్.

కాగా, గతంలో ముంబైలో భారీ ఈవెంట్ నిర్వహించినా సినిమా కరోనా వల్ల వాయిదా పడటంతో అది వృథా అయింది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు
[…] కూడా తగిన ప్రాధన్యత దక్కలేదు. ఈ సినిమా నిడివి మరీ ఎక్కువుగా ఉంది. పైగా […]