నయనతార అలా ఇలా అంటూ ఆమె గురించి లేనిపోని వార్తలు రాస్తూ తెగ హడావిడి చేస్తారు గాని, నిజానికి నయనతార పద్ధతిగల అమ్మాయి అట. ఈ విషయాన్ని చెప్పింది ఆమెను త్వరలోనే పెళ్లాడనున్న దర్శకుడు విగ్నేష్ శివన్. ఇప్పటికే వీరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక విగ్నేష్ అభిమానులతో జరిపిన చిట్ చాట్ లో నయనతార గురించి చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఇతగాడు నయనతార గురించి ఏమి చెప్పాడు ? అలాగే, నయనతారలో తనకు నచ్చే గుణాలను ఇప్పుడు ఏకరువు పెట్టడానికి కారణం ఏమిటయ్యా అంటే.. ఓ అభిమాని నయనతారలో మీకు బాగా నచ్చేది ఏమిటి అని అడగగా.. విగ్నేష్ శివన్ సిగ్గు పడుతూ తన ప్రియురాలి గురించి కూల్ గా సెలవిచ్చాడు. మేకప్ తీసేసి షూటింగ్ నుంచి ఇంటికి వస్తే నయనతార ఒక సాదాసీదా అమ్మాయిలా ఉంటుంది.
ఇంటిలో తానూ పెద్ద హీరోయిన్ని అనే ఆలోచన తనకు ఉండదు. పైగా తాను వంట కూడా చేస్తుంది. అలాగే ఇంటి పనులు చేస్తోంది. మీరు ఆమెను హౌస్ వైఫ్ గా చూస్తే అసలు నమ్మలేరు. అంతగా నయనతార మారిపోతుంది. ఇక నయనతార చికెన్ చాల బాగా వడుతుంది. అందుకే ఆమె చేసే వంటల్లో నా ఫేవరెట్ మాత్రం చికెన్ ఫ్రైనే అని విగ్నేష్ శివన్ చెప్పాడు.
ప్రస్తుతం విగ్నేష్, నయనతార కలిసే ఉంటున్నారు కాబట్టి, విగ్నేష్ శివన్ మాటలను నమ్మొచ్చు. ఎందుకంటే దాదాపు నాలుగేళ్లుగా వీరి సహజీవనం సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటికీ కోలీవుడ్ లో నయనతారనే నంబర్ వన్ హీరోయిన్. అయినా ఇంట్లో మాత్రం సాధారణ యువతిలా ఇంటి పని వంట పని చేయడం అంటే అది నయనతార గొప్పతనమే. ఇక ఈ ముదురు జంట పెళ్లి ఎప్పుడు అంటే ? ‘కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత ఉంటుంది’ అంటూ విగ్నేష్ స్పష్టం చేశాడు.