‘టీడీపీ నేతల’ అమరావతి అక్రమాలు: అంతుతేల్చేందుకు జగన్ రెడీ?

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన భూ అక్రమాలపై అంతతేల్చేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది. ఇప్పటికే ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తో చంద్రబాబు, టీడీపీ నేతలకు ఉచ్చు బిగించింది. అయితే ఆ ఎఫ్ఐఆర్ ను రద్దు చేసింది హైకోర్టు. దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా ఎఫ్ఐఆర్ లే రద్దు అయిపోయారు. అయితే ఎఫ్ఐఆర్ రద్దు చేసిన ఐదు నెలల తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుండడం ఆసక్తి రేపుతోంది. […]

Written By: NARESH, Updated On : June 29, 2021 8:24 pm
Follow us on

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిన భూ అక్రమాలపై అంతతేల్చేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది. ఇప్పటికే ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తో చంద్రబాబు, టీడీపీ నేతలకు ఉచ్చు బిగించింది. అయితే ఆ ఎఫ్ఐఆర్ ను రద్దు చేసింది హైకోర్టు. దీనిపై చంద్రబాబు, టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా ఎఫ్ఐఆర్ లే రద్దు అయిపోయారు. అయితే ఎఫ్ఐఆర్ రద్దు చేసిన ఐదు నెలల తర్వాత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుండడం ఆసక్తి రేపుతోంది.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరిట అక్రమాలు జరగలేదని జనవరి 20న హైకోర్టు తీర్పును ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటీషన్ ను జగన్ ప్రభుత్వం దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఎస్.ఎల్.పీని అంగీకరించి.. కేసును మూడు వారాల తర్వాత విచారణ చేస్తామని పిటీషన్ ను స్వీకరించింది. దీంతో చంద్రబాబు, టీడీపీ నేతలు చిక్కుల్లో పడ్డట్లు అయ్యింది. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేయడంతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది.

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అక్రమాలపై సీఐడీ ఇప్పటికే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో సహా పలువురు నాయకులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే హైకోర్టు మాత్రం వీరిపై నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టేసింది.

అమరావతిలోని రాజధాని ప్రాంతంలో గల వెలగపూడి గ్రామంలో నివసిస్తున్న  ఎస్. సురేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అమరావతిలో భూ లావాదేవీల్లో అంతర్గత వ్యాపారం జరిగిందని సీఐడీ కేసు వేసింది. గత టీడీపీ ప్రభుత్వం అంతర్గ వర్తకంలో మునిగిపోయిందని.. టీడీపీ నేతలకు మేలు చేసిందని కేసులు పెట్టింది. తక్కువ ధరలకు అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారని జగన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలను హైకోర్టు కొట్టివేసినా సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు జగన్ సర్కార్ రెడీ అయ్యింది.