Homeఎంటర్టైన్మెంట్Nayanthara and Vignesh: స్టార్ అయితేనేమీ ఓ ఇంటికి కోడలేగా.,. నయనతారకు అత్తయ్య కండీషన్స్!

Nayanthara and Vignesh: స్టార్ అయితేనేమీ ఓ ఇంటికి కోడలేగా.,. నయనతారకు అత్తయ్య కండీషన్స్!

Nayanthara and Vignesh: స్టార్ హీరోయిన్ నయనతారకు అత్తయ్య కండీషన్స్ పెట్టారట. ఇకపై అలానే నడుచుకోవాలని ఆదేశించారట. లేడీ సూపర్ స్టార్ కి వాళ్ళ అత్త పెట్టిన కండీషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దశాబ్దానికి పైగా సౌత్ ఇండియాను ఏలుతుంది నయనతార. చంద్రముఖి, గజిని వంటి చిత్రాలతో ఫేమ్ తెచ్చుకున్న ఆమె స్టార్ లేడీగా అవతరించారు. సౌత్ లో నయనతార అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ఉన్నారు. సినిమాకు అత్యధికంగా రూ. 6 కోట్ల వరకు ఆమె చార్జ్ చేస్తున్నారు. ఆమెకున్న డిమాండ్ నేపథ్యంలో స్టార్ హీరోల పక్కన జతకడుతూనే, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

Nayanthara and Vignesh
Nayanthara, Vignesh

కాగా నయనతార కెరీర్ లో విజయాలతో పాటు వివాదాలు కూడా చూశారు. హీరో శింబుతో ఆమె వ్యవహారం పెద్ద రచ్చ అయ్యింది. ఇద్దరూ కొంత కాలం ప్రేమాయణం సాగించారు. ఈ క్రమంలో వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు బయటికి రావడం సంచలనమైంది. శింబుతో విడిపోయిన నయనతార పెళ్లై, పిల్లలున్న ప్రభుదేవాతో పెళ్ళికి సిద్ధమైంది. ఈ రిలేషన్ కారణంగా నయనతార విమర్శలు ఎదుర్కొంది. తర్వాత ఆయనతో కూడా నయనతార విడిపోయారు.

Also Read: Virata Parvam Vennela Character: అడవి కాచిన వెన్నెలే సరళ.. అతని స్ఫూర్తితో ఉద్యమ బాట.. ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య!

విగ్నేష్ శివన్ తో మూడో ప్రేమ బంధం మాత్రం పెళ్లి వరకు వెళ్ళింది. 2015 లో విడుదలైన నానుమ్ రౌడీదాన్ మూవీకి విగ్నేష్ దర్శకుడు కాగా… నయనతార హీరోయిన్ గా చేశారు. ఆ మూవీ చిత్రీకరణ సమయంలో నయనతార ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట 2022 జూన్ 9న వివాహం చేసుకున్నారు.

Nayanthara and Vignesh
Nayanthara, Vignesh

ఇక ఇల్లాలిగా మారిన నయనతారకు అత్తయ్య కొన్ని కండీషన్స్ పెట్టారట. మొదటి కండీషన్ గా సినిమాలు మానేయాలి అన్నారట. అలాగే గతంలో ఒప్పుకున్న చిత్రాల్లో కూడా ఎటువంటి ఎక్స్ పోజింగ్ చేయరాదని, వల్గర్ సన్నివేశాల్లో నటించరాదని చెప్పారట. కాగా ఇటీవల విడుదలైన కాతువాకుల రెండు కాదల్ మూవీలో నయనతార కేవలం చీరల్లో కనిపించారు. ఆమె ఏమాత్రం ఎక్స్ పోజింగ్ చేయలేదు. మరో హీరోయిన్ సమంత మాత్రం హాట్ ట్రెండీ డ్రెస్సులో అలరించింది.

Also Read:Sudheer- Getup Srinu- Auto Ram Prasad: సుధీర్ – గెటప్ శ్రీను – రాంప్రసాద్ కాంబినేషన్ ని మళ్ళీ చూడలేమా ?
Recommended Videos
Nayanthara పై ఫైర్ అయిన ప్రభుదేవా భార్య || Prabhudeva Wife Ramlath Fired on Nayanthara
పెళ్ళైన 3 రోజులకే నయనతార సంచలన నిర్ణయం || Nayanthara GoodBye To Movies || Nayanthara Marriage
నయనతార పెళ్లి కి డుమ్మా కొట్టిన  సమంత || Reasons Behind Samantha Not Attended Nayanthara Marriage

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

Comments are closed.

Exit mobile version