Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తరువాత సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. బంగార్రాజు, లవ్ స్టోరీ సినిమాల హిట్ తో మరిన్ని చిత్రాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ నటి ప్రాచీ దేశాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది దీంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరినట్లు సమాచారం.

ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తన మాజీ భార్య సమంత కూడా రెచ్చిపోవడంతో ఆమెకు సమాధానంగా నాగచైతన్య సదరు హీరోయిన్ తో సఖ్యత పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. క్లబ్బులు, పబ్బులు తిరుగుతూ ఆమెతో సరదాగా గడుపుతున్నట్లు చెబుతున్నారు. సమంత తన ఫొటోలతో అభిమానులను రెచ్చగొడుతూ చేస్తున్న హంగామాతో తాను కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చైతు ఇలా చేస్తున్నారని సినీ వర్గాల భోగట్టా.
Also Read: RRR Surpasses Hollywood Avengers: హాలీవుడ్ ‘అవేంజెర్స్’ ని దాటేసిన RRR
దూత వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. గతంలో విక్రమ్ మాధవన్ హీరోగా 13బి అనే హారర్ సినిమా నిర్మించారు. దీంతో ఇందులో నాగచైతన్యను ఎలా చూపిస్తారో అని ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. టీవీ సీరియల్ పాత్రలతో భయాన్ని సృష్టించి ఆసక్తి చూపారు. దీంతో ప్రస్తుతం నాగచైతన్య పాత్రను ఎలా తీర్చిదిద్దుతారోననే ఆతృత అభిమానుల్లో కనిపిస్తోంది. మొత్తానికి నాగచైతన్య తన సినిమాల ఎంపికలో అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

నాగచైతన్యతో కలిసి ఉన్న ఫొటోను కూడా ప్రాచీ దేశాయ్ పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. సామాజిక మాధ్యమాల్లో వీరి జంటను చూసి మురిసిపోతున్నారు. సమంత చేస్తున్న దానికి బదులుగా నాగచైతన్య కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారని అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. దీనిపై సమంత ఇంతవరకు స్పందించలేదు. అదంతా వ్యక్తిగత వ్యవహారంగా కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య కూడా తన పర్ఫార్మెన్స్ చూపించేందుకు సమయం ఆసన్నమైందని అందరు చెప్పుకుంటున్నారు.
తాను చేసేది తాను చేస్తే నేను చేసేది ఉండదా అని చైతు కూడా అనుకున్నట్లు చెబుతున్నారు. అందుకే సమంతకు దీటుగా జవాబిచ్చే ఉద్దేశంతోనే ఈ మేరకు ఆ హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సమాచారం. సమంత కూడా నైట్ డేట్ కు వెళ్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పెట్టడంతో దానికి ప్రతీకారంగానే చైతు కూడా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read:Virata Parvam Vennela Character: అడవి కాచిన వెన్నెలే సరళ.. అతని స్ఫూర్తితో ఉద్యమ బాట.. ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య!
Recommended Videos



[…] Also Read: Naga Chaitanya: ఆ హీరోయిన్ తో పార్టీలు పబ్బులు.… […]