Vidudala 2 Movie Review
Vidudala 2 Movie Review: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు వేట్రి మారన్…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ముఖ్యంగా అనగారిన వర్గాలను ఇన్వాల్వ్ చేస్తూ ఆయన రాసుకున్న కథలు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆదరణ పొందుతూ ఉంటాయి. ఇక ఆ బేస్ లోనే వచ్చిన అసురన్ లాంటి సినిమా కూడా యావత్ తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తూ వచ్చాయి.
ఇక ఆయన గత సంవత్సరం చేసిన విడుదల సినిమా కూడా వెనుకబడిన వర్గాలకు సంభందించిన సినిమా కావడం విశేషం…మరి మొదటి పార్ట్ కి మంచి ఆదరణ అయితే లభించింది. ఇక అదే రీతిలో సెకండ్ పార్ట్ ని కూడా తీశారు. మరి ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన దక్కించుకుంటుంది. ఈ సినిమా వల్ల పేరు మరోసారి వెట్రి మారన్ పేరు ఇండస్ట్రీలో భారీగా వినిపించబోతుందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇక విడుదల మూవీ మొదటి పార్టు లో పోలీస్ కానిస్టేబుల్ గా నటించిన కొమిరేషు (సూరి) మరియన్ (విజయ్ సేతుపతి) ని పట్టించడంతో మొదటి పార్ట్ ఎండి అవుతుంది.ఇక రెండో పార్ట్ ని అక్కడి నుంచి స్టార్ట్ చేయడం ఒక రకంగా ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకు అంటే ప్రేక్షకుడు తన ఎమోషన్ ని సస్టైన్ చేసుకొని ఉన్నాడు. ఇక అక్కడ నుంచి ఈ సినిమాని కంటిన్యూ చేయడం అనేది ఇప్పుడు కూడా ఒక హై మూమెంట్ ఇచ్చిందనే చెప్పాలి… ఇక సెకండ్ పార్ట్ విషయానికి వస్తే మరియన్ ను ఎన్ కౌంటర్ చేయడానికి పోలీసులు జీప్ లో ఫారెస్ట్ లోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు విజయ్ తను ఒక లీడర్ గా ఎలా ఎదిగాడు.
తనమీద జనాలు పెట్టుకున్న నమ్మకాలు ఏంటి అంటూ ఒక కథను అయితే చెబుతాడు. ఇక మరియన్ లక్ష్మీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమె బతికే ఉందా? ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇలాంటి విషయాలను పోలీసులతో చెబుతూ ఉంటాడు. మరి మొత్తానికైతే విజయ్ సేతుపతి పోలీసుల నుంచి తప్పించుకున్నాడా లేదంటే పోలీసుల చేతిలోనే ఎన్ కౌంటర్ అయ్యాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే వెట్రి మారన్ గత సినిమాల్లో ఎలాగైతే ఒక రియలేస్టేక్ సీన్స్ ఉంటాయో ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా విజయ్ సేతుపతిని చాలా బాగా వాడుకున్నాడు. మొదటి నుంచి చివరి వరకు విజయసేతుపతి ని కాకుండా ఒక నటుడిగా అతన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాడు. అందువల్ల ఈ సినిమాలో విజయ్ సేతుపతి మారియన్ క్యారెక్టర్ లో మనకు కనిపించడమే కాకుండా అందులో జీవిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా తన వైపు తిప్పుకునెట్టుగా చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు…ఇక కంప్లీట్ గా తన స్టైల్ లోనే ఈ సినిమాని తెరకెక్కించారు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా క్లియర్ కట్ గా అర్థమవుతుంది.
ఇక సినిమాలో అప్స్ అండ్ డౌన్స్ ఎమోషన్ ను క్యారీ చేస్తూ సినిమా మొత్తాన్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక మొత్తం అడవి ప్రాంతంలోనే ఈ సినిమాను తీయడం వల్ల మనందరం ఒక డీప్ ఫారెస్ట్ లో ఉన్నామనే ఫీల్ అయితే కలుగుతుంది. ఇక వెట్రీ మారన్ సినిమాల్లో కథ పెద్దగా లేకపోయినా కూడా ఉన్న కథతోనే అయినా చాలా వరకు మ్యాజిక్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేస్తూ ఉంటాడు…
ఇక ఈ సినిమాలో ఆయన చెప్పాలనుకున్న పాయింట్ చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఇక దానికి తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నాడు. ప్రతి క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ అందించిన మైన్యూర్ డీటెయిల్స్ ని కూడా యాడ్ చేసుకుంటూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ విషయానికి వస్తే విజయ్ సేతుపతి ఈ సినిమా మొత్తం ముందుకు తీసుకెళ్లడనే చెప్పాలి. ఇక చాలా ఎక్కువ సేపు ఆయన కనిపిస్తూ ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయడంలో చాలా వరకు ప్రయత్నమైతే చేశాడు. అయితే ఈ సినిమాలో ఆయన మంచి పాత్రను పోషించాడు అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తెలియజేయడం విశేషం…
మంచి క్యారెక్టర్ లో తబాబుంటాను ప్రూవ్ చేసుకోవడం తో పాటుగా లేని పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకోవడానికి ఆయనకు ఈ సినిమా చాలా వరకు హెల్ప్ చేస్తుందనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరం ఇప్పటికే మహారాజా సినిమాతో నటన పరంగా అద్భుతాన్ని క్రియేట్ చేసిన విజయ్ సేతుపతి ఈ సినిమాతో మరోసారి ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నాడనే చెప్పాలి…
ఇక మంజు వారియర్ కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. మిగిలిన ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ వాళ్ళ లిమిటేషన్స్ ను క్రాస్ చేయకుండా డైరెక్టర్ సలహాల మేరకు ఎంతవరకు నటించాలో ఆ పాత్రల్లో అంతవరకు నటించి మెప్పించే ప్రయత్నం చేశారు… ఇక కొమరేసు క్యారెక్టర్ లో సూరి అద్భుతంగా నటించి మెప్పించాడు…
టెక్నికల్ అంశాలు
ఈ సినిమా కథపరంగా ఒకే అనిపించినప్పటికి మేకింగ్ స్టైల్ కొంచెం స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో విజువల్స్ కూడా దానికి తగ్గట్టుగానే వెట్రి మారన్ డిజైన్ చేయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రతి ఫ్రేమ్ లో ఒక ఇంటెన్స్ అయితే బాగుంటుంది. అందుకే దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ప్రతి ఫేమ్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది… ఇక ఇళయరాజా అందించిన మ్యూజిక్ కూడా చాలావరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి…ఇక ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చాడు. ఇక ఈ సినిమా కోసం ఇళయరాజ ను బాగా వాడినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇళయరాజా ఇప్పుడు కూడా చాలా మంచి మ్యూజిక్ ను ఇవ్వగలరని ప్రూవ్ చేసుకుంటూ ఉండడం విశేషం…
ప్లస్ పాయింట్స్
కథ
విజయ్ సేతుపతి యాక్టింగ్
కొన్ని ఎమోషనల్ సీన్స్
మైనస్ పాయింట్స్
స్లో నరేషన్
ఒకే పాయింట్ మీద సినిమా మొత్తాన్ని లాగడం…
రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5