Deputy CM Pavan Kalyan: థింసా నృత్యం గిరిజనులకు పుట్టినిల్లు. అరకు, మన్యంలో ఈ థింసా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. థింసా గిరిజనుల సాంప్రదాయ నృత్యం. ఇది ఒక ఆదివాసీ పదం. గిరిజన ప్రజలు వారి మనోభావాలను తెలుపుతూ ఈ థింసా నృత్యం చేస్తారు. కొందరు మహిళలు కలిసి పాటలు పాడుతూ.. వలయాకారంలో నృత్యం చేస్తారు. ఈ థింసా నృత్యం ఎక్కువగా విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తుంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ థింసా నృత్యాన్ని చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గంలో నేడు ఆయన పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి వెళ్లిన పవన్ అక్కడి ప్రజలను పలకరించారు. ఈ క్రమంలో బాగుజోల వద్ద గిరిజనులతో కలిసి సంప్రదాయ థింసా నృత్యం చేశారు. గుంపుగా కలిసి కొంతమంది వంకరంగా కలిసి తిరుగుతూ థింసా నృత్యం చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఆ గిరిజన మహిళలతో నృత్యం చేస్తుంటే.. ఇలా కదా ఒక రాజకీయ నాయకుడు ఉండాలని నెటిజన్లు అంటున్నారు. గిరిజన ప్రాంతంలో మాత్రమే నృత్యం చేసే ఈ సంప్రదాయ థింసాకు చాలా ప్రాముఖ్యత ఉంది.
Chief @PawanKalyan garu enjoying dimsa dance❤️😍#PawanKalyan #Janasena pic.twitter.com/FsWdU51P9C
— HYDERABAD PSPK FANS – RTC X ROADS (@HydPSPKFansRTCX) December 20, 2024
పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేస్తున్న సమయంలో బాగుజోల దగ్గర వర్షం కూడా పడుతుంది. అయిన కూడా పవన్ అక్కడి గిరిజనులతో సరదాగా థింసా నృత్యం చేశారు. వర్షానికి మిగతా కొందరు ప్రజలు గొడుగులతో పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌ను వీక్షించారు. వర్షానికి తడుస్తున్న కూడా పవన్ గిరిజనులతో థింసా నృత్యం చేయడంతో.. అందరూ ఎంత సాదాసీదాగా ఉన్నారని పవన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా పవన్ థింసా నృత్యం చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కదా పవర్ అంటే అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆ కొండల్లో నడుస్తూ పవన్ కళ్యాణ్ గిరిజనుల కుటుంబాల దగ్గరకు పవన్ నడుచుకుంటూ వెళ్లారు. పార్వతీపురం మన్యంలో కొంత దూరం వరకు ప్రతేక విమానంలో వెళ్లిన పవన్ ఆ తర్వాత రోడ్డు మార్గంలో సాలూరు చేరుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత సాలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఎలక్షన్ సమయంలో ఓట్లు కోసం మాత్రమే రాజకీయ నాయకులు వెళ్తారు. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్ల వరకు పట్టించుకోరు. కానీ పవన్ నియోజకవర్గంలో నడుస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కొండ ప్రాంతాల్లో కూడా నడుస్తూ ప్రజల కష్టాలను అడిగి మరి తెలుసుకున్నారు.
Deputy CM @PawanKalyan dancing with the tribals of Manyam ❤️🥺!!#PawanKalyan pic.twitter.com/uFOaHY7AaD
— గుడివాక శేషుబాబు యువత (అవనిగడ్డ) (@gudivaka_seshu) December 20, 2024