Chennai Floods : చెన్నై వరదలు : రజినీకాంత్ ‘నిండా’ మునిగారు.. వీడియో వైరల్…

ఇక ఈ సినిమా మీద అటు తమిళ్ ఇండస్ట్రీ లోనూ,ఇటు తెలుగు ఇండస్ట్రీ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుపుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ రజినీకాంత్ అభిమానులు మొన్నటి దాకా సోషల్ మీడియాలో రచ్చ చేశారు...

Written By: NARESH, Updated On : December 8, 2023 8:36 pm
Follow us on

Chennai Floods : ప్రస్తుతం చెన్నై పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మిగ్‌జామ్ తుఫాన్ దాటికి కామన్ మ్యాన్ దగ్గరనుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. కామన్ మ్యాన్ ఇండ్లలోకి వాటర్ రావడం వల్ల వాళ్లకి తినడానికి తిండి లేదు,కరెంటు లేదు, పడుకోవడానికి కొంచం ప్లేస్ కూడా లేకపోవడం తో వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ గత మూడు, నాలుగు రోజుల నుంచి ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు రజనీకాంత్ ఇల్లు కూడా ఆ వరద నీటితో నిండిపోయిందని తెలుస్తుంది. ఇక రజనీకాంత్ ఇల్లును చూపిస్తూ రజనీకాంత్ ఇల్లు కూడా వాటర్ లో మునిగిపోయింది అంటూ ఒక వీడియోని అప్లోడ్ చేశాడు ఇక ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.తుఫాన్ దెబ్బ కి చెన్నై నగరం మొత్తం అతలాకుతలం అవుతుంది.

రజనీకాంత్ లాంటి సెలబ్రిటీ నే అంత ఇబ్బందులకు గురవుతున్నాడు అంటే ఇక సామాన్య జనాల పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చెన్నై లో ఈ పరిస్థితిలు కుదురుకోవాలంటే ఇంకో 2, 3 రోజులు పడుతుందని తెలుస్తుంది. ఇప్పటికే సహాయక చర్యల కోసం హీరో సూర్య, కార్తీ ఇద్దరు పది లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.

ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ ఈ సంవత్సరం జైలర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా అటు తమిళ్, ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీల్లో కలిపి 400 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ప్లాపుల్లో ఉన్న రజనీకాంత్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించి ఒక సూపర్ సక్సెస్ ను అందించింది.అలాగే సూపర్ స్టార్ సినిమా అంటే ఎలా ఉంటుందో మరోసారి ప్రేక్షకులకు చూపించింది. ఇక ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనక డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి రెఢీ అయ్యాడు. ఇక అంతలోనే చెన్నై నగరం మొత్తం తుఫాన్ తో అతలాకుతలం అవ్వగా, మొన్నటి వరకు ఆ సినిమా కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న రజనీకాంత్ ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నాడు. ఇక ఈ తుఫాను భారీ నుండి చెన్నై నగరం ఎప్పటికీ కోలుకుంటుందో చూడాలి…

ఇక ఈ సినిమా మీద అటు తమిళ్ ఇండస్ట్రీ లోనూ,ఇటు తెలుగు ఇండస్ట్రీ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుపుకొని ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ రజినీకాంత్ అభిమానులు మొన్నటి దాకా సోషల్ మీడియాలో రచ్చ చేశారు…