Mahesh Rajamouli Movie: మహేష్(Super Star Mahesh Babu) అభిమానులతో పాటు, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న #SSRMB అప్డేట్ మరో పది రోజుల్లో రానుంది. ఈ నెల 15 న రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీవినీ ఎరుగని రేంజ్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఈవెంట్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన చిన్న యాడ్ వీడియో ని జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఈవెంట్ కి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా లక్ష మందికి పైగా అభిమానులు హాజరు కాబోతున్నారని టాక్. అందుకు తగ్గ ఏర్పాట్లు మొత్తం చకచకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అక్కడికి వచ్చే అభిమానులకు ఈవెంట్ మొత్తం కనిపించేందుకు 100 అడుగుల LED టీవీ ని కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటి వరకు ఈ రేంజ్ లో ఇంత పెద్ద LED స్క్రీన్ ని ఏ ఈవెంట్ కి కూడా ఏర్పాటు చేయలేదు. దీనిని బట్టీ చూస్తే ఏ రేంజ్ లో మూవీ టీం ప్లానింగ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఈవెంట్ లో సినిమాకు సంబంధించి మూడు నిమిషాల గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారట. ఇందులో చూపించే విజువల్స్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసే విధంగా ఉంటాయని టాక్. ఇప్పటి వరకు ఈ సినిమా లో మహేష్ బాబు కాకుండా పృథ్వీ రాజ్, ప్రియాంక చోప్రా వంటి వారు నటిస్తున్నారని మన అందరికీ తెలుసు. ఇంకా ఈ చిత్రం లో నటిస్తున్న నటీనటుల గురించి పూర్తిగా తెలియాల్సి ఉంది. హీరోయిన్ ఎవరు అనే దానిపై కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రియాంక చోప్రా చేస్తున్నది నెగిటివ్ రోల్ అని అంటున్నారు. దీనిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ని లాక్ చేసారని టాక్. ఈ టైటిల్ కి , ఆ కాంబినేషన్ కి అసలు సంబంధమే లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#SSMB29 A 100ft LED Tower at RFC #MaheshBabu #Rajamouli pic.twitter.com/iDD4I3ZdXX
— Milagro Movies (@MilagroMovies) November 4, 2025