https://oktelugu.com/

Game Changer Movie: బస్సు ప్రయాణికులకు బంపర్ ఆఫర్..’గేమ్ చేంజర్’ చిత్రం ఉచిత ప్రదర్శన..పట్టించుకోని నిర్మాతలు!

ఓటీటీ కాలంలో థియేటర్స్ కి జనాలు రావడం బాగా తగ్గించేశారు అని నిర్మాతలు చాలా కాలం నుండి వాపోతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఈమధ్య విడుదల అవుతున్న పెద్ద హీరోల సినిమాలకు కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఒకప్పటి లాగా నెల రోజులకు పైగా మంచి థియేట్రికల్ షేర్స్, గ్రాస్ వసూళ్లు కూడా వస్తున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : January 12, 2025 / 08:38 PM IST

    Game changer Movie Free screening in the bus ,

    Follow us on

    Game Changer Movie: ఓటీటీ కాలంలో థియేటర్స్ కి జనాలు రావడం బాగా తగ్గించేశారు అని నిర్మాతలు చాలా కాలం నుండి వాపోతుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే ఎట్టకేలకు ఈమధ్య విడుదల అవుతున్న పెద్ద హీరోల సినిమాలకు కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ఒకప్పటి లాగా నెల రోజులకు పైగా మంచి థియేట్రికల్ షేర్స్, గ్రాస్ వసూళ్లు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా థియేటర్స్ లో విడుదలైన నెలరోజుల తర్వాతే ఓటీటీ లో విడుదల చేయాలనీ అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇండస్ట్రీ కి పైరసీ భూతం మళ్ళీ నిర్మాతలను వణికిపోయేలా చేస్తుంది. నిన్న గాక మొన్న విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం HD ప్రింట్ పైరసీ అందుబాటులోకి వచ్చేసింది. నిన్న హైదరాబాద్ నుండి తమ సొంత ఊర్లకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పెద్ద ఎత్తున జనాలు బయలుదేరుతుండడంని మనమంతా సోషల్ మీడియా లో వీడియోస్ ద్వారా చూసాము.

    ఎవరో కొంతమంది ప్రయాణికులు వెళ్తున్న బస్సులో ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ప్రదర్శించారు. దానికి సంబంధించిన ఫోటోలను తీసి, సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి, నిర్మాతలను ట్యాగ్ చేసి యాక్షన్ తీసుకోండి అని అడిగితే వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం గమనార్హం. అసలే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. పైగా సౌండ్ తో సహా అద్భుతమైన క్వాలిటీ తో ప్రింట్ అందుబాటులోకి వచ్చేసింది. అభిమానులు అయితే కచ్చితంగా థియేటర్స్ కి వెళ్లి సినిమాని చూస్తారు. కానీ మామూలు ఆడియన్స్ ఎందుకు వెళ్తారు?, అనేక మంది ఈ చిత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని, దానికి సంబంధించిన సన్నివేశాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినా కూడా నిర్మాతలు పట్టించుకోవడం లేదు. దీనిని ఎలా తీసుకోవాలో కూడా పాపం అభిమానులకు అర్హం కావడం లేదు. తమ హీరో సినిమాకి డ్యామేజ్ చేస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు.

    అదే విధంగా నేడు విడుదలైన నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రానికి సంబంధించిన HD ప్రింట్ కూడా ఆన్లైన్ లోకి వచ్చేసింది. ఈ లెవెల్ పైరసీ కి గురి అవుతున్నాయి మన సినిమాలు. ప్రతీ చిత్రం విడుదల రోజే ఆన్లైన్ లో థియేటర్ ప్రింట్ వచ్చేస్తుంది. కానీ క్లారిటీ గా ఉండదు కాబట్టి ఆడియన్స్ దానిని పట్టించుకోలేదు. కానీ ఈ రేంజ్ క్లారిటీ తో మాత్రం అందుబాటులోకి వస్తే ఆడియన్స్ 300,400 టికెట్ రేట్స్ పెట్టి, గంట ప్రయాణం చేసి సినిమా కోసం నాలుగు గంటల సమయం కేటాయించాల్సిన అవసరం ఎందుకు అనుకోవచ్చు కదా. రాబోయే రోజుల్లో ఈ పైరసీ భూతం చాలా డేంజర్ కానుంది. దీనిని నిర్మాతలు తేలికగా తీసుకోకుండా, గట్టిగా యాక్షన్స్ తీసుకోవాలి. లేకపోతే తెలుగు సినీ పరిశ్రమ చాలా తీవ్రమైన నష్టాలను ఎదురు చూసే అవకాశాలు ఉంటాయి. మరి ఫిలిం ఛాంబర్ ఏమి చేయబోతుందో చూడాలి.