Victory Venkatesh: వెంకటేష్ – రానా కలయికలో సినిమా వస్తే చూడాలని దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వీరి కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి ‘రానా నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యాక వెంకటేష్ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రాన్ని చేయనున్నాడు. పాపులర్ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. పైగా ఈ చిత్రంలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ గా యంగ్ హీరో ‘ఆది పినిశెట్టి’ నటిస్తున్నట్టు సమాచారం.
Also Read: Crazy Multistarrer: మరో భారీ క్రేజీ మల్టీస్టారర్.. హీరోలు ఎవరో తెలుసా ?
ఈ మేరకు అధికారిక కన్ఫర్మేషన్ త్వరలోనే వస్తుంది. కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి. ప్రస్తుతం అయితే.. చైతు ఈ సినిమాకి డేట్లు ఇచ్చాడు. వెంకటేష్ మాత్రం ప్రస్తుతం ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్నాడు. అన్నట్టు ఈ ‘రానా నాయుడు’ సిరీస్ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ రీఎంట్రీ ఇస్తోంది. కాజల్ రిక్వెస్ట్ చేస్తేనే.. రానా నిషా అగర్వాల్ ను ఈ సిరీస్ లో తీసుకున్నాడట. ఇక ఒకే తెర పై బాబాయ్ అబ్బాయ్ లను చూడాలని కుతూహలం గా ఉన్న అభిమానులకు, బాబాయ్ అబ్బాయి ఎలాంటి సర్ ప్రైజ్ లు ఇస్తారో చూద్దాం.
ఇక ఈ సిరీస్ గురించి వెంకటేష్ స్పందిస్తూ.. ‘ఓ చిన్నపిల్లాడి నుంచి పెద్ద వాళ్ళ వరకూ అందరూ ఇష్టపడే విధంగా ఈ సిరీస్ ను తీస్తున్నాం. త్వరలోనే ఈ ‘రానా నాయుడు’ మీ ముందుకు వస్తుంది” అని చెప్పుకొచ్చారు. అలాగే రానాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు చాలా ప్రత్యేకమైనది అని వెంకీ అన్నారు.
Also Read:Chiranjeevi – Niharika: ‘నిహారిక’ సంగతి నన్ను అడగొద్దు అంటున్న మెగాస్టార్