CM Jagan Delhi Tour: జగన్ గతంలో ఢిల్లీ వెళ్లినప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు లేదా..? నామామాత్రంగానే టూర్ ను మమా అనిపించారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సాధారణంగా సీఎం జగన్ ఢిల్లీ వస్తున్నారంటే పెద్ద ఎత్తున రాజకీయ నేతలు.. పారిశ్రామికవేత్తలు కలవటానికి పోటీపడుతుండేవారు. కానీ ఈసారి మాత్రం అలాంటి సందడి లేదనే టాక్ వినిపిస్తోంది.ఎటువంటి ప్రాధాన్యత అంశాలు లేకుండా జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది.
రాష్ట్రానికి సంబందించిన రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలు తదితర అంశాలను సీఎం.. ప్రధాని మోదీ తో పాటు పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఐతే జగన్ టూర్ సక్సెస్ అయిందా..? లేదా? అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఖరారు కాగానే ఓ ప్రత్యేకమైన బృందం ఢిల్లీ వెళ్లేది. అక్కడి కార్యకలాపాలు చక్కబెట్టేవారు. అయితే ఈ సారి అలాంటి బృందం ఏదీ లేనట్లుగా తెలుస్తోంది.
Also Read: AP Cabinet Reshuffle: కొత్త మంత్రివర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారా?
జగన్ ఢిల్లీ వెళ్తున్నారంటే గతంలో కనిపించే హడావుడిలో ఇప్పుడు సగం కూడా లేదన్న భావన అధికార పార్టీలో వ్యక్తమవుతోంది. ఇది రకరకాల చర్చకు దారితీస్తోంది. ప్రధానితో భేటీ సందర్భంగా విభజన హామీల, పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, విభజన చట్టం షెడ్యూల్ 10లోని సంస్థల విభజన, మూడు రాజధానులు వంటి అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై లెక్కలతో సహా వివరించినా చూస్తాం.. చేస్తామనేగానీ స్పష్టమైన హామీలు రాలేదని తెలుస్తోంది.
జగన్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదాకు కేంద్రం సానుకూలంగా లేకపోవడం, మూడు రాజధానుల విషయంలోనూ మద్దతు లేకపోవడంతోనే జగన్ ఒకింత నిరాశతో ఉన్నారన్న టాక్ నడుస్తోంది. అలాగే ఉచిత పథకాల విషయంలో సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కూడా చర్చకు వచ్చే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అలాగే రాష్ట్ర అర్ధిక పరిస్థితి, అప్పులు చేసి ఉచిత పథకాలివ్వడం వంటి అంశాలు ప్రధాని ప్రస్తావించి ఉంటారని.. దాని గురించి వివరణ ఇచ్చే క్రమంలో జగన్ ఓకింత తడబాటు పడడంతో పాటు మనస్తానికి గురయ్యారని సమాచారం.
నీరుగారిన ఆశలు
పెగాసస్ విషయంలో చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తును కోరతారన్న ప్రచారం జోరుగా సాగింది. మరి ఆ విషయాన్ని జగన్ లెవనెత్తారా..? ఒకవేళ ప్రస్తావిస్తే మోదీ ఎలా స్పందించారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఐతే ఇటీవల వైసీపీ మంత్రులు, నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఘాటు విమర్శలు చేయడం, ఆ పార్టీని టీడీపీకి బీ టీమ్ గా అభివర్ణించడం వంటి ఘటనలు ఢిల్లీలో సీఎంను ఒకింత ఇబ్బంది పెట్టి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం సీబీఐ కేసులు, వివేకా హత్య కేసు, ఆర్ధిక అవకతవకలపై చర్చించేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని విమర్శిస్తున్నాయి. కేసుల కోసం ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో వైసీపీ సర్కార్ కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతోందని ఆరోపిస్తున్నాయి.
త్వరలో బీజేపీ నుంచి రోడ్డు మ్యాప్ అందుతుందని.. అందిన వెంటనే ప్రభుత్వంపై ముప్పేట దాడి ఉంటుందని జనసేన హెచ్చరికల నేపథ్యంలో అదే అంశాన్ని జగన్ ప్రస్తావన తెచ్చి ఉంటారన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి బరిలో దిగుతాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రధాని మోదీతో గంట పాటు చర్చల సమయంలో కొన్నింటిని జగన్ ప్రస్తావించి ఉంటారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బాబాయి హత్య కేసు జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
ప్రధాని నుంచి సానుకూలత లేకపోవడం వల్లే జగన్ ఓకింత అసహనంగా కనిపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కోర్టులు కూడా ప్రతికూల తీర్పులు ఇస్తుండడం, జ్యూడీషియల్ పరిధిపై ఏకంగా శాసనసభలో చర్చించడంపై కూడా ప్రధాని మోదీ ఆరా తీసినట్టు తెలుస్తొంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పు పట్టినట్టు సమాచారం. కొన్ని నిర్థిష్టమైన సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో జగన్ నీరుగారిపోయినట్టు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నా గోడు చెప్పుకుందామని వస్తే..తిరిగి ప్రధాని క్షవరం చేయడంతో జగన్ నొచ్చుకున్నట్టు తన ముఖ కవలికలు బట్టి తెలిసిపోతోంది.
Also Read:Fans Surprised NTR At Mubai: వాళ్ళ అభిమానం ఎన్టీఆర్ ను కూడా ఆశ్చర్యపరిచింది