https://oktelugu.com/

drushyam2: సినిమాలో నటించే వరకే నా బాధ్యత.. విడుదల విషయంలో జోక్యం చేసుకోను- వెంకి

drushyam2: రీమేక్​ సినిమాలతో వరుస హిట్లు కొడుతూ.. ఓ వైపు కామెడీ సినిమాలు చూస్తూనే మరోవైపు యాక్షన్​ చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకుల నుంచి మెప్పు పొందుతున్నారు విక్టరి వెంకటేశ్​. ఇటీవలే వెంకి నటించిన నారప్ప సినిమాఅమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ఇదే జోరుతో మరోసారి రీమేక్​  సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యారు వెంకటేశ్​. గతంలో మీనా, వెంకటేశ్​ ప్రధానపాత్రలో నటించిన దృశ్యం సినిమా ఎంత సూపర్​ హిట్​గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి హిట్​ కొట్టేందుకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 19, 2021 / 12:48 PM IST
    Follow us on

    drushyam2: రీమేక్​ సినిమాలతో వరుస హిట్లు కొడుతూ.. ఓ వైపు కామెడీ సినిమాలు చూస్తూనే మరోవైపు యాక్షన్​ చిత్రాల్లో నటిస్తూ.. ప్రేక్షకుల నుంచి మెప్పు పొందుతున్నారు విక్టరి వెంకటేశ్​. ఇటీవలే వెంకి నటించిన నారప్ప సినిమాఅమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. ఇదే జోరుతో మరోసారి రీమేక్​  సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యారు వెంకటేశ్​.

    గతంలో మీనా, వెంకటేశ్​ ప్రధానపాత్రలో నటించిన దృశ్యం సినిమా ఎంత సూపర్​ హిట్​గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి హిట్​ కొట్టేందుకు దృశ్యం 2తో వస్తున్నారు. నవంబరు 25న అమెజాన్​ ప్రైమ్​లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్​లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

    ఈ సినిమాలో తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాంబాబు ముఖ్య ఉద్దేశం. దాని కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమవుతాడు. ఈ సినిమా హిట్​ అవుతుందా? లేదా? అని చాలామందికి అనిపించొచ్చు. కానీ, జీతూ చాలా అద్భుతంగా తెరకెక్కించారు. దృశ్యం సినిమాకు కంటిన్యూటిగా ఈ సినిమా మొదలవుతుంది అని వెంకటేశ్​ చెప్పుకొచ్చారు.

    రాంబాబు వంటి పాత్రలో నిటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వెంకి. సినిమాలో నటించడం వరకే తన బాధ్యతని.. విడుదల విషయంలో అసలు జోక్యం చేసుకోనని చెప్పారు.  సినిమాను మంచిగా తీశామని.. ఇక ప్రేక్షక దేవుళ్లే నిర్ణయించాలని అన్నారు. ఈ బడ్జెట్​కు ఓటీటీ అయితే మంచిదని దర్శక నిర్మాతలు భావించారని.. అందుకే అమెజాన్​లో విడుదల చేస్తున్నట్లు వివరించారు.

    తన అభిమానులు కాస్త హర్ట్ అవుతారని తెలిసినప్పటికీ తప్పలేదని అన్నారు. తర్వాత తీసే సినిమాలతో థియేటర్లలో పలకరిస్తానని అన్నారు వెంకి. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త దర్శకులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సినిమాలే తీయాలని ఎప్పుడూ అనుకోలేదని.. తన దగ్గరు వచ్చిన సినిమాలు ఏదైనా నచ్చితే చేస్తానని అన్నారు.