BJP: వరి ధాన్యం కొనుగోలుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది ఇప్పుడు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదు. జాతీయ మీడియా తెలంగాణలో జరిగే పరిణామాలకు కవరేజీ ఇస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణపై పడింది. ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వానిదే తప్పు అనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ముందడగు వేసింది. నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాష్ట్రాలతో తాము జరిపిన సంప్రదింపులు, నిర్ణయాలు, తరువాత మారిన పరిణామాలు, ఎఫ్‌సీఐ వద్ద నిల్వ ఉన్న ధాన్యపు రాశుల విలువ వంటి అన్ని సమాచారాలు విడుదల చేసింది. ఇందులో ప్రయేమం ఉన్న వివిధ శాఖలు ఈ సమాచారాన్ని విడుదల చేశాయి. దీంతో వాస్తవ పరిస్థితులు దేశ ప్రజల ముందుకు వచ్చాయి.
కుండబద్దలు కొట్టిన కేంద్రం..
వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం కుండబద్దలు కొట్టిన్నట్టు వివరాలన్నీ వెల్లడించింది. తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనబోమని స్పష్టం చేసింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అంగీకారం తెలిపారని చెప్పింది. ఈ ఏడాది ఆగస్టు 17న కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన సమావేశాన్ని అన్ని రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారని తెలిపింది. పలు రాష్ట్ర ప్రభుత్వాల సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకొని పలు అంశాలను నిర్ణయించినట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల నుంచి తమకు జరిగిన ఒప్పందాలన్నీ వెల్లడించింది. పంజాబ్‌లో ఎక్కువ సేకరించి, తెలంగాణలో తక్కువగా సేకరిస్తున్నామని తెలంగాణ సీఎం చెబుతున్నారని కానీ అది సరైంది కాదని అన్నారు. పంజాబ్‌లో ప్రధాన ఆహారం గోదుమ, అలాగే తెలంగాణలో వరి ప్రధాన ఆహార ధాన్యంగా ఉందని చెప్పింది. ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.
Also Read: Three agricultural laws: సాగు చట్టాల రద్దు: మోడీ పంతం ఓడింది.. రైతే గెలిచాడు!
సంకట స్థితిలో రాష్ట్ర బీజేపీ నాయకులు..
కేంద్రం ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేయడంతో రాష్ట్ర బీజేపీ నాయకులు సంకట స్థితిలో పడ్డారు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలో తెలియన పరిస్థితి నెలకొంది. ఇటీవల బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర ప్రారంభించారు. వడ్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. కేంద్రమే కొనవద్దని చెబుతోందంటూ ఆరోపిస్తున్నారు. దీనికి కూడా బీజేపీ నాయకులు ధీటుగా బదులిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం చేసిన ప్రకటనతో వారు అయోమయంలో పడ్డారు. అయితే వరి వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఎలా స్వీకరించి, కొనుగోలు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.
Also Read: KCR Dharna Chouwk: ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ కు ఇప్పుడు అదే దిక్కైంది?